నాడు సంప్రోక్షణ లేదుగానీ.. నేడు అప్పన్నను శాంతి పరుస్తారా..?!


ENS
13
visakhapatnam
2025-05-02 20:22:31

భారత దేశ వ్యాప్తంగా చిన్నపాటి ఆలయం నుంచి పెద్ద పెద్ద  దేవస్థానాల వరకూ.. ప్రధాన ఆలయం ప్రాంగణంలోకి కుక్క దూరినా.. ఉత్స వమూర్తి సంచరించే మాఢవీధుల్లో ఎవరైనా కాలం చేసినా ఆలయం మొత్తం  పసుపు నీటితో శుద్ధి చేస్తారు.. సంస్రోక్షణ చేస్తారు.. అలాంటిది ఏకంగా ఏడురు ప్రాణాలు ఆ దేవ దేవుడు లక్ష్మీనారసింహుడు నడయాడే మాఢవీధుల్లో ఏడుగురు భక్తులు హరీమంటే ఆలయంలో సంప్రో క్షణ చేయలేదు. పైగా ఇపుడు శాంతి పూజలా..? పీనుగలు లేచిన రోజున లేని శాంతి పూజ ఆలోచన ఇపుడు నిర్వాహకులకు ఎలా వచ్చిం ది..? 

స్వయంభూ లక్ష్మీనారసింహుడిని నిజంగా శాంతి పరచాలంటే.. గోడ కూలిన రోజునే ఒక్క గంట స్వామివారి దర్శనాలు నిలుపుదల చేసి ఆఘమేఘాలపై ఆలయం మొత్తం సంప్రోక్షణ చేసి ఉండాలి.. అలా కాని పక్షంలో నిజంగా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది కనుక.. కనీసం ట్యాంక్ డ్రోన్ తోనైనా పసుపునీటిని జనం మధ్యలోనే అప్పన్న భక్తులు దుర్మరణం చెందినందుకు పసుపు నీళ్లు చల్లించాలి. అవేమీ చేయకుండా వేల సంఖ్యలో జనాలను మైలుతోనే ఆలయంలోనికి పంపిన దేవస్థాన వైదిక సిబ్బందిని ఏమనాలి.. అసలు వీరికి వైధిక ధర్మాలు, ఆచార, నియమాలు తెలుసునా లేదా..? అప్పుడు గుర్తుకి రాని పూజలు.. ఇప్పుడు గుర్తొచ్చాయా.. కనీసం పీనుగలు లేచిన చోట మూడవ రోజైనా పూజలు చేసి, సంప్రోక్షణ చేయాలి కదా అంటే.. అబ్బే అవసరం లేదంటున్నారు ఇక్కడి వారు..  నిజంగా సింహగిరిపై వైధిక ధర్మం మంట గలిసిపోలేదా అంటే మాత్రం.. అదేం కాదులే.. అవసరం లేదులే... చందనోత్సవం రోజు గోడ పడిపోయిన ప్రదేశం ఆలయం పరిధిలోనికి రాదు.. కనుక ఆలయానికి మైలు అంటదు.. అంటున్నాయి సింహాచల దేవస్థాన వర్గాలు.

 మరి జనంలో ఉన్న భక్తులు ప్రమాదంలో చనిపోతే.. వారిని ముట్టుకున్న జనం గర్భగుడిలోనికి వెళితే.. దానిని ఏమంటారు..? అది మైలు కాదా..? చందనోత్సవం రోజున క్యూలైన్ లో ఉన్న భక్తులే కాదు.. ఘటనా ప్రదేశంలో ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు, సహాయక చర్యల్లో ఉన్నవారు అందరూ మైలు పడ్డారు. కారణం ప్రమాదంలో మృతిచెందిన వారిని సిమ్మెంటు ఇటుకలు మధ్య నుంచి తొలగించే సమయంలోనూ, మృతదేహాలను వ్యానుల్లోకి ఎక్కించే సమయంలోనూ.. ఒకరినొకరు ముట్టుకున్న వేళ అందరూ మైలు పడినట్టే లెక్క. కనీసం సంప్రోక్షణ చేయని ఆలయ సిబ్బంది కనీసం ఆలయంలోనికి ప్రవేశించే సమయంలో సైతం పసుపు నీళ్లు భయట నుంచి.. ప్రమాద స్థలాన్ని దాటుకొని వచ్చిన వారిపైనా చల్లించే ఏర్పాటూ చేయలేదు. ఇపుడు తగుదనమ్మా అంటూ శాంతిపూజలు ఎవరికోసం చేస్తున్నట్టో దేవస్థాన ఆధికారులు, అర్చ కులు, వైదిక ధర్మం తెలిసిన వారే చెప్పాల్సి వుంది. 

అలా అంటే మాత్రం మాకు నియమాలు తెలుసునని.. అవసరం వచ్చినపుడు ఆదేశాలొచ్చినపుడు అప్పడప్పుడు చేస్తాం లేండి అంటున్నారు.. నిజమే దేవుడితో పరచాకాలు.. అవసరం వచ్చినపుడే ఆచారాలు గుర్తుకు వస్తే ఈ విధంగానే వుంటుందంటూ భక్తులు ఒంటి కాలపై లేస్తున్నారు. సాధారణంగా ఎవరి ఇంట్లోనైనా కాలం చేస్తేనే వారు ఏడ నుంచి `11 రోజులు బయటకు రారు. అదే ఇంట్లో చనిపోతే ఆరు నెలలు ఆ గదులు మూసేస్తారు.. మంచి గడియల్లో జరిగితే హోమాలు చేసి, శుధ్ధి చేసి, ధానాలు, ధర్మాలు ఆచరించి గానీ ఆ ఇంట్లో కార్యకలాపాలు చేయరు. అలాంటిది అప్పన్న ఆలయంలో ఏడుగురు భక్తులు మృతిచెందిన వేళ.. కనీసం స్వామి ఆలయాన్ని శుద్ధి చేయకపోవడంపై భక్తుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. వైధికం తెలిసిన వారు కూడా ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడితే తమను అంటారనుకొని ఆచార వ్యవహారాలు తెలిసిన పండితులు కూడా సింహాచలం ఘటనపై నోరు మెడంప లేదు. కారణం విషయం మొత్తం రాజకీయం అవుతోందిని..

నీతి, ధర్మం, న్యాయం, వైదికం, శాస్త్రం తెలిసిన నేతలనూ తప్పుబట్టించారు..
సింహాచలంలో అప్పన్న చందన యాత్ర రోజున చందన యాత్రకు బదులు.. శవయాత్ర జరిగినపుడే కూటమి నాయకులు, ఆలయాన్ని శుద్ధిచేయాలని సూచిస్తే.. అవసరం లేదు.. ఘటన ఆలయం బయట జరిగింది కదా ఆలయానికి మైలు అంటదని కొందరు ఆలయ సిబ్బంది, అధికారులు ఈ విషయాన్ని బయటకు రానీయలేదట. అంతేకాదు.. ఈ విషయంలో జిల్లా అధికారులు గానీ, దేవస్థాన అధికారులు గానీ ఎవరూ ఏమీ మాట్లాడకుండా పై నుంచి వచ్చిన ఆదేశాలు.. అధికారులు, చెప్పినట్టుగానే అంతా నడుచుకోవాల్సి వచ్చిందని కూడా చెప్పుకొస్తున్నారు. వాస్తవానికి చందనయాత్ర రోజున అప్పన్న సన్నిధిలో జరిగిన దుర్మణాల ఘటన తరువాత ఆలయాలన్ని సంప్రోక్షణ కాదు కదా.. కనీసం శుద్ధి కూడా చేయలేదనే విషయాన్ని ఈరోజు-ఈఎన్ఎస్ వెలుగులోనికి తీసుకొచ్చింది. 

అయితే ఇపుడు ఆ విషయం రాజకీయం అవుతున్నవేళ.. మళ్లీ దేవస్థాన అధికారులు, అక్కడి వైదిక సిబ్బంది సింహాద్రి అప్పన్నను శాంతి పరచడానికి శాంతిపూజలు, హోమాలు చేస్తే సింహాద్రి అప్పన్న శాంతిస్తాడని చెపుబుతున్నా. అలా అయితే అప్పన్న భక్తులు మృతిచెందిన మరుసటి రోజైనా చేయాలి కదా అంటే మాత్రం ఆ ఒక్కటి అడక్కు అంటున్నారు. ఇపుడు అధికారులు, నేతలు తీసుకున్న నిర్ణయాలుపై భక్తుల నుంచి అనేక ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. సింహాచలం దేవస్థానంలో పనిచేస్తున్న వారికి సనాతన ధర్మాలు, సంప్రోక్షణలు, శాంతి పూజలు, హోమాలుపై ఎంత వరకూ అవగాహన ఉందో తెలియదు గానీ.. నాడు చేయని శుద్ధి..నేడు విషయం రాజకీయం అవుతున్నవేళ చేస్తే ఆ పాపం దేవ దేవుడి రూపంలో ఆలయానికి అరిష్టంగా మారదా అనేవారికి.. ప్రశ్నిస్తున్నవారికి ఎవరు ఏ విధంగా సమాధానం చెబుతారు. అదేసమయంలో ఆరోజు సంప్రోక్షణను దాటవేసినందుకు నేడు జరుగుతున్న రాజకీయం కారణంగా నిజంగానే సంప్రోక్షణ చేయడానికి వీలు లేకుండా పోయింది. 

వాస్తవానికి పీనుగలు లేచిన చోట కనీసం పసుపునీళ్లతో అయినా శుధ్ది చేయాలి.  ఆలయాన్ని మూసివేసి సంప్రోక్షణ చేయాలి.. అలా చేయకుండా ఆరోజు వేలాది మంది భక్తులు రావడం, ప్రమాదం జరిగిందని తప్పించుకున్న సింహాచలం దేవస్థానం అధికారులు, ప్రజాప్రతినిధులు కనీసం మూడవ రోజైనా ఆ పనిచేసి ఉంటే బాగుండేదనే ఆచార వ్యవహారాలు తెలిసిన వారు సూచిస్తున్నారు. కానీ ఈ విషయం రాజకీయం అయిన తరువాత చేస్తే.. తమ మాట పోతుందని.. నిజంగానే వైధిక ధర్మాలు తెలియవని ప్రక్కపార్టీల దగ్గర పరువు పోతుందనే నెపంతో నిజంగా ఆలయానికి సంప్రోక్షణ చేయకుండా అడ్డు పడినట్టు అయ్యింది నేడు. 

 నిజంగా దేవుడి ముందు వైధిక ధర్మాలు, ఆలయ నియమాలు, నిబంధనలు, ఆచారాలు కంటే ఒక్కోసారి రాజకీయాలు తీవ్రంగా ప్రభావితం చేస్తాయనడానికి అప్పన్న చందనోత్సవ వేళ ఏడుగురు భక్తులు మృతిచెందిన తరువాత చేయని ఆలయ సంప్రోక్షణ నిజంగానే ఈ విషయంలో చేయకుండా పోవడానికి కారణం అవుతుందని నిజమైన వైదికులు నెత్తీ నోరూ కొట్టుకుంటున్నారు. ఇలాంటి దారుణమైన పరిస్థితులే మరే ఇతర దేవస్థానంలోని దేవుళ్లకు రాకూడదని వేల వేల దండాలు పెడుతున్నారు.. చందన దారి నీ గుడిలో జరిగిన ఈ తప్పుని మంచి మనసుతో మన్నించమని వేడుకుంటున్నారు. కనీసం తరువాత రోజుల్లో అయినా వైధిక ధర్మాలు, ఆచారాలు, వ్యవహారాలు, ఆలయ శుద్ధి సంప్రోక్షణలు, హోమాల విషయంలో అనాలోచితంగా ఆలోచించేవారికి తెలియజేసేలా చేయమని వేడుకుంటున్నారు.. ?!
సిఫార్సు