ఫార్మశీ కళాశాల ప్రిన్సిపాల్‌గా రాజేందప్రసాద్..
Ens Balu
6
Andhra University
2020-09-30 19:00:48
ఆంధ్రవిశ్వవిద్యాలయం ఫార్మశీ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఆచార్య వై.రాజేందప్రసాద్ నియమితులయ్యారు. బుధవారం సాయంత్రం ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి నుంచి నియామక ఉత్తర్వులను ఆచార్య రాజేంద్ర ప్రసాద్ స్వీకరించారు. గురువారం ఉదయం ఆచార్య రాజేంద్ర ప్రసాద్ ఫార్మశీ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉద్యోగ బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ సందర్భంగా వీసి మాట్లాడుతూ, ఎంతో ప్రతిష్టాత్మక యూనివర్శిటీ అయిన ఏయూలో ఫార్మసీ విభాగంలో పరిశోధనల మరింత అధికంగా చేసే విధంగా విద్యార్ధులను ప్రోత్సహించాలన్నారు. వచ్చే రోజులన్నీ ఫార్మసీ కి ఎంతో భవిష్యత్తు ఉన్నందున ఫార్మసీ కళాశాల మరింత పటిష్టంగా మారాల్సిన అవసరం వుందన్నారు. దేశంలోనే ఆంధ్రాయూనివర్శిటీలో ఫార్మశీ పరిశోధనలకు మంచి పేరు ఉందని, ఎక్కువమంది విద్యార్ధుల వివిధ అంశాలపై ఫార్మసీలో పరిశోధనలు చేసే స్థాయికి తయారు చేయాలన్నారు.