ఆక్షరయోధునికి ఆత్మీయ సత్కారం..
Ens Balu
4
ఆంధ్రాయూనివర్శిటీ
2020-09-30 19:06:16
ఆంధ్రవిశ్వవిద్యాలయం జర్నలిజం విభాగాధిపతి ఆచార్య పి.బాబి వర్ధన్ పదవీ విరమణ పురస్కరించుకుని వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి తన కార్యాలయంలో సత్కరించారు.ఆచార్య బాబి వర్థన్ దంపతులను సత్కరించి, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వీసి మాట్లాడుతూ, ఆచార్య బాబీవర్ధన్ తన వ్రుత్తిలో ఎంతో నిబద్ధతో పనిచేశారన్నారు. అదే సమయంలో ఎందరో జర్నలిజం విద్యార్ధులకు మార్గదర్శిగా కూడా నిలిచారన్నారు. మరెందరో విద్యార్ధులు ఆయన మార్గదర్శకంలో ఆచార్యులుగా మారడానికి ఎంతో క్రుషి చేశారని అన్నారు. మీడియారంగంలో ఎంతో మంది జర్నలిజం విద్యార్ధులు స్థిరపడ్డారంటే ఆ స్థాయిలో తర్ఫీదు ఇచ్చిన ఘనత బాబీకే దక్కుతుందన్నారు. అదేసమయంలో ఏయూ మీడియాసెల్ ఇన్చార్జిగా కూడా ఎంతో సేవలు అందించారని విసి కొనియాడారు. పదవీ విరమణ తరువాత సైతం విశ్వవిద్యాలయం ప్రగతిలో భాగం కావాలని విసి బాబీవర్ధన్ కి సూచించారు..