విశాఖకు సమాచారశాఖ రాష్ట్ర కార్యాలయం..
Ens Balu
4
Visakhapatnam
2020-09-30 19:29:24
విశాఖలోని పరపాలనా రాజధానికి రాష్ట్ర కార్యాలయాల తరలింపు ముహూర్తం సమాచార పౌరసంబంధాల శాఖతోనే జరిగేట్టు కనిపిస్తుంది. విజయవాడలోని రాష్ట్ర కార్యాలయాన్ని విశాఖ తరలించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు సమాచారం. అందులో భాగంగానే విశాఖలోని డిప్యూటీ డైరెక్టర్ కి బదిలీచేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈయనకు బదిలీ జరగడం, రాష్ట్ర కార్యాలయం విశాఖ రావడం ఒకేసారి జరిగితే, విశాఖ సమాచారశాఖ కమిషనరేట్ ఏర్పాటవుతుందిని తెలుస్తుంది. అపుడు మరిన్ని పోస్టులు ఇక్కడ పెరిగే అవకాశం కూడా వుంటుంది. అసలే విశాఖజిల్లా సమాచారశాఖలో సిబ్బంది కొరత వేధిస్తోంది.. రాష్ట్రప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా దాన్ని రాష్ట్ర సమాచారశాఖ ద్వారానే ప్రజలు మీడియా ద్వారా తెలియజేస్తుంది. అలా జరగాలంటే ముందు సమాచారశాఖ కార్యాలయాలన్ని విశాఖ తరలిస్తే...అక్కడ పూర్తిస్థాయిలో కార్యాలయ కార్యకలాపాలు ప్రారంభించడానికి అవకాశం వుంటుందని రాష్ట్ర అధికారులు భావిస్తున్నారట. దానికోసం విశాఖజిల్లాలోని సమాచారశాఖలో బదిలీల ప్రక్రియను పక్కనపెట్టినట్టు ప్రచారం జరుగుతుంది. ఈ లోగానే అక్రిడిటేషన్ ప్రక్రియ పూర్తిచేయడానికి కూడా సమాచారశాఖ ఆగమేఘాలపై నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. 2017 తరువాత సమాచారశాఖ పూర్తిస్థాయి అక్రిడిటేషన్లు జర్నలిస్టులకు ఇవ్వలేదు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే అక్రిడిటేషన్ లు ఎక్స్ టెన్షన్ల చేస్తూ సంవత్సరాలు సంవత్సరాలు పొడిగిస్తూ వస్తారు. అదే సమయంలో దేశరాజధాని ఢిల్లీలోని పీఐబీలో కూడా లేని నిబంధనలన్నీ ఏపీలో అక్రిడిటేషన్లకు పెట్టడం కూడా గమనార్హం. ఈ క్రమంలోనే రాష్ట్ర కార్యాలయం తరలింపు ప్రక్రియ చర్చనీయాంశం అవుతోంది..