ముగ్గురు వాలంటీర్లు సస్పెన్షన్..


Ens Balu
5
Srikakulam
2020-09-30 19:56:41

శ్రీకాకుళం జిల్లాలో ఫీవర్ సర్వే సక్రమంగా నిర్వహించని ముగ్గురు వాలంటీర్లపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు వార్డు, గ్రామ సచివాలయ, అభివృద్ధి విభాగం జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు బుధ వారం ఒక ప్రకటన విడుదల చేస్తూ భామిని మండలం బురజోల గ్రామంలో ఫీవర్ సర్వే సక్రమంగా నిర్వహించకుండా ముగ్గురు వాలంటీర్లు విధుల పట్ల నిర్లక్ష్యధోరణి ప్రదర్శించారన్నారు. ముగ్గురు వాలంటీర్లు – కలిశెట్టి సుస్మిత, కలిశెట్టి జయరాజు, కొవ్వాడ శ్రావణిలను సస్పెన్షన్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. గ్రామ సర్వేలియన్సు అధికారిగా విధులపట్ల అలక్ష్యం వహించిన వెలుగు సిసి వెంకట రావు, కంటైన్మెంటు జోన్ సక్రమంగా నిర్వహించనందుకు గ్రామ రెవిన్యూ అధికారి పి.సంజీవరావుకు మెమోలు జారీ చేసామని ఆయన తెలిపారు. జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ఇంటింటి ఫీవర్ సర్వే అత్యంత ప్రధానమైనదని ఆయన పేర్కొంటూ అటువంటి విధులను నిర్లక్ష్యం చేసే వారిని ఉపేక్షిచేది లేదని స్పష్టం చేసారు. ప్రజారోగ్యం రీత్యా ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో విధులు నిర్వహించాల్సిందేనని ఆయన అన్నారు.