ప్రతిభకు పేదరికం అడ్డుకాదు..
Ens Balu
3
Vizianagaram
2020-09-30 20:28:40
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఐఐఎం) లో జాతీయ స్ధాయిలో 17వ ర్యాంకు సాధించిన గుమ్మడి వెంకట కె హిమజా శ్రావణికి జిల్లా కలక్టరుడా. ఎం. హరి జవహర్ లాల్ అభినందనలు తెలిపారు. వేపాడ మండలం వేపాడ గ్రామానికి చెందిన శ్రావణి తండ్రి గుమ్మడి శ్రీను, తల్లి కృష్ణవేణితో కలిసి బుధవారం కలక్టరు ఛాంబరులో కలక్టరును కలిసారు. కలక్టరు హరి జవహర్ లాల్ స్పందిస్తూ ప్రతిభకు పేదరికం అడ్డం కాదని, గ్రామీణ ప్రాంతంలో జన్మించి మంచి ర్యాంకు సాధించడం గొప్ప విషయమన్నారు. చిరుద్యోగులైన వారి తల్లిదండ్రుల ఆశయాలను నిజం చేసి తన గురువులకు, మంచిపేరు తీసుకువచ్చిందని శ్రావణి భవిష్యత్తులో మరింత ఉత్తమ స్ధాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రతిభ ఉన్న పిల్లలను తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే వారిలో ఉత్సాహం పెరిగి వారి సమర్ధతను చాటగలరని చూపిన శ్రావణి అభినందనీయరాలన్నారు. ఎంతోమంది బాలికలకు స్పూర్తిగా నిలిచిందని అభినందిస్తూ శ్రావణి, తన తల్లిదండ్రులకు పుష్ప గుచ్చాలు అందజేసి, శాలువాతో సత్కరించారు.