ఆర్. ఓ.ఎఫ్.ఆర్ పట్టాల పంపిణీకి సిద్ధం..
Ens Balu
4
Parvathipuram
2020-09-30 20:31:37
రాష్ట్ర ప్రభుత్వం భూమి లేని గిరిజన రైతులకు భూములు మంజూరు చేసి వారి జీవితాల్లో వెలుగులు చూడాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక మంచి కార్యక్రమం చేపట్టారని గిరిజన సంక్షేమ శాఖ సెక్రెటరీ కాంతిలాల్ దండే పేర్కొన్నారు. బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ గిరిజన సంక్షేమ శాఖ సెక్రెటరీ కాంతిలాల్ దండే, డైరెక్టర్ రజిత్ భాషా మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలననుసరించి. గిరిజన రైతులకు ఆర్.ఓ.ఎఫ్ ఆర్ పట్టాలు అందించేందుకు సిద్ధం కావాలన్నారు, అసలు భూమి లేని గిరిజన రైతులను గుర్తించి వారికి ముందు ఆర్. ఓ.ఎఫ్.ఆర్ పట్టాలు అందించేందుకు సిద్ధం కావాలి అన్నారు. విజయనగరం జిల్లాలో ఏజెన్సీ గ్రామాల్లో భూములు పంచేందుకు మొత్తం సిద్దం చేసినట్టు పీఓ కాంతిలాల్ దండే కి వివరించారు. ఈమేరకు స్వయంగా పరిశీలన కూడా చేసినట్టు చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు ఐ.టి.డి.ఏ, ప్రాజెక్టు అధికారి అర్ కూర్మనాథ్, పార్వతీపురం తహసీల్దార్ కార్యాలయం నుంచి పాల్గొన్నారు.