చంద్రమౌళి సేవలు మరువరానివి..
Ens Balu
4
Tirupati
2020-09-30 20:41:24
వి.ఆర్.చంద్ర మౌళి జిల్లా కు అందించిన సేవలు మరువ లేనివని జిల్లా కలెక్టర్ డా. నారాయణ భరత్ గుప్త కొని యాడారు. బుధవారం సాయంత్రం చి త్తూరు నాగయ్య కళా క్షేత్ర ము లో జిల్లా జాయింట్ కలెక్టర్ (సంక్షేమము)గా విధులు నిర్వర్తిస్తూ నేడు పదవీ విరమణ పొందు తున్న వి.ఆర్.చంద్ర మౌళి గారి సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలె క్టర్ విచ్చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడు తూ ఒక అధికారి గా ఉద్యోగంలో చేరి నప్పటి నుంచి రిటైర్ అయ్యే అంత వరకు ఒకే ప్రవర్తనతో పని చేసిన వ్యక్తి చంద్ర మౌళి అని,ఒక జాయింట్ కలెక్టర్ గా ఎప్పుడు హోదా ప్రదర్శిం చ లేదని, ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను ఎంతో ఓపికతో స్వీకరించడం జరిగే దని,జిల్లా లో 14 సంవత్స రాలు సేవలు అందించడం, తాను మదనపల్లె సబ్ కలె క్ట ర్ గా ఉన్న కాలంలో మరి యు కలెక్టర్ గా సంవత్సరం నకు పైగా చంద్రమౌళి తో కలసి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.. పద వీ విరమణ బాధా కరమని ప్రతి ఉద్యోగికి తప్పనిసరని చెబుతా..పదవీ విరమణ అనంతరం చంద్ర మౌళి వారి కుటుంబము తో పూర్తి సమయాన్ని కేటాయించి సంతోషంగా గడ పాలని కోరుకుంటున్నామని,మీ సేవలు మరు వలేనివని తెలిపారు..
తిరుపతి మునిసిపల్ కమీ షనర్ గిరీషా మాట్లాడుతూ ఎంతటి పెద్ద కార్యక్రమాన్ని అయినా ప్రణాళికాబద్ధంగా ఎటువంటి పొరపాట్లు జరగ కుండా చేయగలిగిన వ్యక్తి చంద్రమౌళి అని.. క్రింది స్థాయి సిబ్బంది సమస్యల ను కూడా తెలుసుకొని ఉన్నతాధికారులకు తెలిపి పరిష్కరించేవారని తెలి పారు. జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ) వి. మార్కండే యులు మాట్లాడుతూ జిల్లా లో చంద్రమౌళి సమర్థ అధి కారిగా మంచి పేరు తెచ్చు కున్నారని.. ఈయన జిల్లా కు అందించిన సేవలు మరు వలేనివని తెలిపారు. విఆర్ చంద్రమౌళి మాట్లాడు తూ నా విధి నిర్వహణలో గ్రామ, మండల,జిల్లా స్థాయి లో అధికారులు సహకరము మరియు ప్రజాప్రతి నిధులు, జిల్లా లో గల స్వచ్ఛంద సం స్థల సహకారం మరువ లేని దని... జిల్లా లో 14 సంవత్స రాలు పనిచేశానని,జిల్లా లో పనిచేసే అధికారులు మంచి వారని.. ప్రింట్ అండ్ ఎల క్ట్రానిక్ మీడియా వారు కూడా బాగా సహకరించా రని అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తొలుత చిత్తూరు శాసన సభ్యులు ఆరణి శ్రీనివాసులు వి.ఆర్. చంద్రమౌళి ని సన్మానించి సత్కరించారు.
కార్యక్రమంలో భాగంగా వి.ఆర్.చంద్రమౌళి దంపతు లను శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం పురోహితుల ఆశీర్వాదాల నడుమ జిల్లా కలెక్టర్ ఘనంగా సత్కరించారు... అనంతరం వివిధ శాఖలకు చెందిన అధి కారులు, సిబ్బంది చంద్ర మౌ ళి గారిని సత్కరించా రు. ఈ సన్మాన కార్యక్రమం లో జిల్లా జాయింట్ కలెక్టర్(అభి వృద్ధి)వి. వీరబ్రహ్మం, ట్రైనీ కలెక్టర్ విష్ణు చరణ్,డి ఆర్ ఓ మురళి ,జిల్లా జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) బాధ్యత లు స్వీకరించనున్న రాజ శేఖర్,చిత్తూరు ఆర్డీవో రేణు కా,డ్వామా,డిఆర్డీఏ పిడి లు చంద్రశేఖర్ ,తులసి, కలెక్టరేట్ ఏవో గోపాలయ్య కలెక్టరేట్ లోని సెక్షన్ల సూప రింటెండెంట్లు, జిల్లా స్థాయి అధికారులు,ఎంపి డిఓలు, వివిధ శాఖల అధికారులు సిబ్బంది, అల్ ఇం డియా ఎస్ సి,ఎస్.టి ఐక్య వేదిక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి ముని స్వామి, కళా కారులు పాల్గొన్నారు..