హెల్త్ కార్డులు రెవెన్యువల్ పై గంట్ల హర్షం..


Ens Balu
2
Visakhapatnam
2020-10-01 14:15:30

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జర్నలిస్టుల హెల్త్ కార్డులు ఎలాంటి రుసుము తీసుకోకుండా వచ్చేఏడాది వరకూ రెవిన్యువల్ చేయడం పట్ల జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు హర్షం వ్యక్తం చేశారు. విశాఖలో ఈ సందర్భంగా శ్రీనుబాబు మీడియాతో మాట్లాడుతూ, కరోనా సమయంలో జర్నలిస్టులపై భారం వేయకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం జర్నలిస్టుల హెల్త్ కార్డులను రెవిన్యువల్ చేయడం పట్ల ముఖ్యమంత్రి వైఎస్.జగన్మో హనరెడ్డి, డిప్యూటీ సీఎం ఆళ్లనానిలకు అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా వచ్చే ఏడాది మార్చి వరకూ అన్ని నెట్వర్క్ ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం చేయించుకోవచ్చునన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8456 మంది జర్నలిస్టులకు ఈ హెల్త్ కార్డుల ద్వారా ప్రయోజనం చేకూరుతుందని గంట్ల శ్రీనుబాబు ఆనందం వ్యక్తం చేశారు. అదేవిధంగా ప్రభుత్వం అక్రిడిటేషన్ల ప్రక్రియ కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి కొత్త అక్రిడిటేషన్ కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.