ప్లాస్మాదానానికి దాతలు ముందుకి రావాలి..


Ens Balu
4
King George Hospital
2020-10-01 15:03:07

విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రి లో 22 లక్షలు రూపాయలతో  ఏర్పాటు చేసిన ప్లాస్మా ఫెరిసిస్ యంత్రాన్ని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్  గురువా రం ఉదయం ప్రారం భించారు.  ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ   ఈ యంత్రం ద్వారా రక్తం నుండి ప్లాస్మా, ప్లేట్లెట్స్  సేకరించి  అవసరమైన పేషెంట్స్ కు వినియోగిస్తారని  జిల్లా కలెక్టర్ తెలిపారు. కోవిద్-19 పేషెంట్స్ చికిత్సకు  అవసమైన   ప్లాస్మా ఈ కేంద్రం నుండి సేకరించడం జరుగుతుందని తెలిపారు.  కరోనా నుండి కోలుకున్నవారు వారి ప్లాస్మా  దానం చేస్తే  దానిని  అత్యవసర పేషెంట్స్ కు చికిత్స చేయవచ్చు నని తెలిపారు.  ప్లాస్మా దానానికి  కరోనా నుండి కోలుకున్న ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరారు.   ప్లాస్మా దానం చేసిన వారిని అబినందించారు. యంత్రo కొనుగోలుకు 22 లక్షలు, యితర పరికరాలకు 10 లక్షలు, కన్స్యూమర్ గూడ్స్ కొనుగోలుకు 10 లక్షలు  కోవిద్ నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కె. జి. హెచ్. సూపరింటెండెంట్  డాక్టర్ సుధాకర్,  బ్లడ్ బ్యాంకు ఇంచార్జి డాక్టర్ శ్యామల  యితర అధికారులు పాల్గొన్నారు.