మాత మరణాలను నియంత్రించాలి..
Ens Balu
4
కలెక్టరేట్
2020-10-01 15:07:51
విశాఖ జిల్లాలో తల్లి మరణాలు జరగకూడదని జిల్లా జాయింట్ కలెక్టర్-2 పి. అరుణ్ బాబు వైద్యులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లాలో తల్లి మరణాలపై ఆయన సమీక్షించారు. ప్రసవాలకు ముందు కాని, తరువాత కాని తల్లి మరణాలు జరగకూడదన్నారు. ఈ యేడాది ఏప్రిల్ నెల నుండి ఆగష్టు నెల వరకు ఎంత మంది మరణించారని, మరణాలకు గల కారణాలను వైద్యులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఇక మీదట తల్లి మరణాలు సంభవించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి తెలిపారు. ముందుగానే గర్భిణీలకు కౌన్సిలింగ్ చేసి ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలో వైద్యులు తెలియ జేయాలని సూచించారు. గర్భణీలకు ఏ ఇబ్బంది వచ్చినా వైద్యులను సంప్రదించే విధంగా తెలియజేయాలని చెప్పారు. ఈ సమావేశం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పి. సూర్యనారాయణ, ఐసిడిఎస్ పి.డి. సీతామహాలక్ష్మి, కెజిహెచ్ నుండి డా. టి. నాగమణి, డా. బి. శ్రీనివాసరావు, అరుణ శుభశ్రీ, విక్టోరియా ఆసుపత్రి నుండి హేమలత దేవి, తదితరులు పాల్గొన్నారు.