బాలూ...ఈ రూపంలో చిరస్థాయిగా


Ens Balu
3
East Godavari
2020-10-01 15:12:41

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం భౌతికంగా మన  ముందు లేనప్పటికీ ఆయన ప్రతిరూపం కళాకారుల మదిలో చిరస్మరణీయంగా ఉంటుందని.. మహో న్నత వ్యక్తి యొక్క విగ్రహాన్ని తొలిసారిగా తాను మలిచానని అంతర్జాతీయ తొలి తెలుగు మహిళా శిల్పి దేవికారాణి ఉడయార్ అన్నారు. గురువారం ఆమె ఈఎన్ఎస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు.. ఇప్పటికే పలు జిల్లాల నుండి బాల సుబ్రహ్మణ్యం  విగ్రహాలు  తయారు చేయమని అడిగారని వారందరికీ త్వరలోనే  బాలువిగ్రహాలు  అత్యద్భుతంగా మలిచి  అందజేస్తానని దేవికారాణి అన్నారు. బాలసుబ్రమణ్యం తో తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటూ  తన తండ్రి ఉడయార్ తాను తయారు చేసిన  ఘంటసాల విగ్రహాలను తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల ఎస్పీ బాలసుబ్రమణ్యం చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగిందని  అన్నారు. బాలసుబ్రహ్మణ్యం అభిమానులకు శిష్యులకు కోరుకున్న వారికి బాల సుబ్రహ్మణ్యం యొక్క ఆరంగుళాల ప్రతిమలను తయారుచేసి అందించగలరని దేవికారాణి అన్నారు. ఇటువంటి కళాకారుడు మరల మనకు దొరకక పోవచ్చు అని ఘంటసాల తర్వాత అంతటి వైభవం సంతరించుకున్న బాలసుబ్రమణ్యం మృతికి తన ప్రగాఢ  సంతాపాన్ని దేవికారాణి ఉడయార్ తెలియజేశారు.