ఏపిఎడ్‌సెట్‌కు 66.18% హాజరు..


Ens Balu
2
ఆంధ్రాయూనివర్శిటీ
2020-10-01 15:24:17

ఆంధ్రప్రదేశ్  వ్యాప్తంగా బిఈడి కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన ఎడ్‌సెట్‌ 2020 ‌ప్రవేశ పరీక్ష గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం సెట్‌ ‌కోడ్‌ను ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 నగరాలలో ఏర్పాటు చేసిన 50 పరీక్ష కేంద్రాలలో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఆన్‌లైన్‌లో పరీక్షను నిర్వహించారు. పరీక్షకు 15,658 మంది దరఖాస్తు చేయగా 10,363మంది హాజరవగా 5296 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. పరీక్షకు హాజరైనవారి శాతం 66.18 గా నమోదయింది. పరీక్ష ప్రశాంత వాతావరణంలో జరిగినట్లు కన్వీనర్‌ ఆచార్య ఆర్‌.‌శివ ప్రసాద్‌ ‌తెలిపారు. ఉదయం నిర్వహించిన సెట్‌ ‌కోడ్‌ ఎం‌పికలో వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి, కన్వీనర్‌ ఆచార్య ఆర్‌.‌శివ ప్రసాద్‌, ఆచార్య టి.షారోన్‌ ‌రాజు తదితరులు పాల్గొన్నారు.