భోగాపురం భూసేకరణ సత్వరమే పూర్తవ్వాలి..


Ens Balu
1
Vizianagaram
2020-10-01 18:32:39

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న   భోగాపురం ఎయిర్ ఫోర్టు భూసేకరణకు అత్యంత ప్రాధాన్యత నిచ్చి పనులు వేగవంతమయ్యేలా చూడాలని జిల్లా కలక్టరు  డా. ఎం. హరి జవహర్ లాల్ అధికారులను ఆదేశించారు.  గురువారం సంయుక్త కలక్టరు డా. జి.సి. కిషోర్ కుమార్ తో కలిసి భోగాపురం ఎయిర్ ఫోర్టు, తోటపల్లి, తారక రామ తీర్ధసాగర్, వెంగళరాయ సాగర్ తదితర ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణపై సమీక్షించారు.  భోగాపురం ఎయిర్ ఫోర్టుకు సంబంధించి గత వారం రోజుల్లో చేసిన పనులపై ఉప కలక్టరు వారీగా, గ్రామం వారీగా  సమీక్షించారు. పనుల్లో ఆశించిన ప్రగతి జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు.  అవాంత రాలను అధిగమించి ఎయిర్ ఫోర్టు భూసేకరణ అత్యంత వేగంగా జరపాలని ఆదేశించారు.   ఇకపై ప్రతి రెండు రోజులకు సమీక్షిస్తానని, పురోగతి చూపని వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.   ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ పూర్తయిన వాటికి అవార్డులు పాస్ చెయ్యాలని, తదుపరి బిల్లులను కూడా అప్ లోడ్ చెయ్యాలని ఆదేశించారు.  కోర్టులలో ఉన్న కేసులు పరిష్కార మయ్యేలా వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలన్నారు.  సమస్య ఉన్నచోట రైతులతో చర్చించి  ప్రత్యామ్నాయాలను,  పరిష్కార మార్గాలను చూపాలన్నారు. ఈ సమావేశంలో రెవిన్యూ డివిజనల్ అధికారి సిహెచ్. భవానిశంకర్, భూసేకరణ ఉప కలక్టర్లు జయరాం, వెంకటేశ్వర్లు, బాలా త్రిపుర సుందరి, సాల్మన్ రాజ్, సంబంధిత తహశీల్ధార్లు పాల్గొన్నారు.