ఆరోగ్యశాఖ వివిధ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం
Ens Balu
3
Vizianagaram
2020-10-01 18:36:53
జాతీయ ఆరోగ్యమిషన్ క్రింద జిల్లాలో వివిధ పోస్టులను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేయడానికి ధరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జి ల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహ ర్‌లాల్ ఒక ప్రకటనలో తెలిపారు. గైనకాలజీ స్పెషలిస్టు, అనెస్థీషియన్స్, పిడియాట్రీషియన్, ఎంబిబిఎస్ వైద్యులు, ఫిజియోథెరపీ, స్టాఫ్ నర్స్, లేబ్ టెక్నీషియన్, బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్, ఎల్‌టిఎన్‌విబిడిసిపి, ఫార్మాసిస్ట్, మెడికల్ ఆఫీసర్(డెంటల్), అడాలిసెంట్ కౌన్సిలర్, ఆర్ఎంఎన్‌సిహెచ్ కౌన్సిలర్, మోనటరింగ్ కన్సల్టెంట్, క్యూఏ కన్సల్టెంట్, ఎపిడిమాలజిస్ట్, రేడియో గ్రాఫర్ లేదా ఎక్స్‌రే టెక్నీషియన్, డైటీషియన్ లేదా న్యూట్రీషనిస్ట్, ఆడియాలజిస్ట్ లేదా స్పీచ్ థెరపిస్ట్, ఆప్టోమెటరిస్ట్, ఎర్లీ ఇంటర్‌వెన్షనిస్ట్ లేదా స్పెషల్ ఎడ్యుకేటర్, సోషల్ వర్కర్, డెంటల్ టెక్నీషియన్, ఫిజియోథెరపిస్ట్(మల్టీ), రిహాబిలిటేషన్ వర్కర్, సోషల్ వర్కర్(ఎన్‌టిసిపి), హాస్పటల్ అటెండెంట్ ఎన్‌పిహెచ్‌సిఇ, శానిటరీ అటెండెంట్, ఓటి టెక్నీషియన్స్, సపోర్టు స్టాఫ్, కుక్ కమ్ కేర్ టేకర్, వార్డ్ క్లీనర్స్, ఫిజియాట్రిక్ నర్స్, స్పెషలిస్ట్ ఎంఓ ఫిజీషియన్ లేదా కన్సల్టెంట్ మెడిసిన్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. ఖాళీల వివరాలు, కావాల్సిన అర్హతలు, అనుభవం తదితర పూర్తి సమాచారం కోసం www.vizianagaram.nic.in వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు తెలిపారు. పూర్తి చేసిన ధరఖాస్తులను నిర్ణీత గడువులోగా జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి కార్యాలయానికి అందజేయాలని సూచించారు.