అనంతో యుపిఎస్సీకీ పక్కా ఏర్పాట్లు..


Ens Balu
7
Anantapur
2020-10-01 19:05:58

అనంతపురం జిల్లాలో యూపీఎస్సీ పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా  పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు సంబం ధిత అధికారులను  ఆదేశించారు.  పరీక్షల నిర్వహణలో వంద శాతం యూపీఎస్సీ నిబంధనలను పాటించాలని, ఎక్కడా నిబంధనల ఉల్లంఘన జరగ కూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. గురువారం స్థానిక కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో సివిల్ సర్వీసెస్(ప్రిలిమినరీ) పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో  యూపీఎస్సీ  తరఫున అండర్ సెక్రటరీ సాబిల్ కిండో తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న యూపీఎస్సీ పరీక్షలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 4 కేంద్రాలలో యూపీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తుండగా, అనంతపురం జిల్లా కేంద్రం కూడా అందులో ఒకటన్నారు. జిల్లా కేంద్రంలో 8 వెన్యూలలో పరీక్షలు నిర్వహిస్తున్నామని, అందులో 7 సెంటర్ లు సాధారణమైనవని, అందులో ఒకటి స్పెషల్ సెంటర్ అన్నారు.  8 వెన్యూలలో 189  ఎక్జామినేషన్ హాల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. పరీక్షల నిర్వహణలో యూపీఎస్సీ నిబంధనలను ఖచ్చితంగా పాటించి వాటిని అమలు చేయాలన్నారు. ఈ నెల 4వ తేదీన ఉదయం 9:30 నుంచి 11:30 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 4:30 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 10.58 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారన్నారు. అనంతపురం సెంటర్లో 3312 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారన్నారు. యూపీఎస్సీ పరీక్షలలో క్యాండిడేట్ ఫ్రెండ్లీ నెస్ అనేది చాలా ముఖ్యమన్నారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు అవసరమైన అన్ని రకాల వసతులను 100 శాతం పూర్తిగా కల్పించాలన్నారు.  ప్రతి 20 మంది అభ్యర్థులకు ఒక ఇన్విజిలేటర్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షల కోసం ఎనిమిది మంది లోకల్ ఇన్స్ పెక్టింగ్  ఆఫీసర్లను, సిట్టింగ్ స్క్వాడ్ లను, అసిస్టెంట్ సూపర్వైజర్ లను, లైజన్ ఆఫీసర్లను నియమించామన్నారు. వెన్యూ సూపర్వైజర్లు సంబంధిత కేంద్రానికి సంబంధించి పూర్తి ఇంచార్జి గా ఉంటారన్నారు. లోకల్ ఇన్స్ పెక్టింగ్ ఆఫీసర్లు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారన్నారు. పరీక్షలు సజావుగా, సక్రమంగా జరిగేందుకు అవసరమైన అన్ని రకాల వసతులు కల్పించాలని, పరీక్ష హాల్లో లైట్లు, ఫ్యాన్లు సరిగ్గా పని చేస్తున్నాయా లేదా అనేది చూసుకోవాలని, వెలుతురు ఉందా లేదా, బెంచీలు సరిపడినవి ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలని, అభ్యర్థుల కోసం తాగునీటి సరఫరా చేయాలని, సెక్యూరిటీని ఏర్పాటు చేయాలన్నారు. వసతుల కల్పనలో ఎటువంటి రాజీ పడకూడదని, అభ్యర్థులు సజావుగా పరీక్షలు రాసేలా అన్ని రకాల ఏర్పాట్లు ఖచ్చితంగా చేయాలన్నారు. పరీక్ష హాల్లో ఒక అభ్యర్థి నుంచి మరొకరికి రెండు మీటర్ల దూరం ఉండేలా చూసుకుని బెంచీలు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష హాల్లో బ్లాక్ బోర్డులు, బెంచీలపై, కిటికీలపై ఎటువంటి రాతలు ఉండరాదని, పేపర్లు అతికించకుండా చూసుకోవాలన్నారు. అన్ని రకాల వసతులు కల్పించారాలేదా అనేది ముందుగానే పరిశీలించాలని, అన్నిచోట్లా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలన్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోకి వచ్చేటప్పుడు వారిని మెటల్ డిటెక్టర్ ద్వారా చెక్ చేయాలన్నారు. అభ్యర్థులెవరూ పరీక్షహాల్లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు..  చెకింగ్ అన్నది బాగా జరగాలని, మొబైల్ ఫోన్లు, వాచ్ లు, కెమెరాలు, క్యాలిక్యులేటర్ లు లాంటివి పరీక్ష హాల్లోకి నిషేధం అన్నారు.   ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ల ద్వారా ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు. నిర్వహించాలన్నారు.  కడపజిల్లా నుంచి 609 మంది, కర్నూలు జిల్లా నుంచి  900 మంది అభ్యర్థులు హాజరవుతున్నందున వారికి రవాణా సౌకర్యం లో ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా వారి కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. అలాగే అనంతపురం నగరంలో ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ ల నుంచి జేఎన్టీయూ, ఎస్కేయు సెంటర్ లకు వెళ్లేందుకు ప్రత్యేకంగా బస్ సర్వీసులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఆర్ ఎం సుమంత్ ను ఆదేశించారు. కడప, కర్నూల్ నుంచి స్పెషల్ ట్రైన్లను ఏర్పాటు చేయాల్సిందిగా డిఆర్ఎం తో మాట్లాడామన్నారు. జేఎన్టీయూ, ఎస్కేయు సెంటర్ లలో అభ్యర్థుల భోజన వసతికి వీలుగా క్యాంటీన్లు తెరచాలని ఆదేశించారు. అదే విధంగా ఇతర పరీక్షా కేంద్రాల్లో కూడా బిస్కట్లు, త్రాగునీరు లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కోవిడ్ నేపథ్యంలో పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు భౌతిక దూరం పాటించాలని, శాని టైజర్లు తీసుకురాకూడదన్నారు. ప్రతి వెన్యూ పరీక్ష కేంద్రం లోనూ పల్స్ ఆక్సీ మీటర్లను సిద్ధంగా ఉంచాలన్నారు. పరీక్షలకు సంబంధించి శుక్రవారం ఇన్విజిలేటర్ల కు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. 12 మంది అభ్యర్థులకు స్క్రైబ్స్ అవసరం ఉందని, అందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ వివరించారు.