గోదాముల నిర్వహణ పటిష్టంగా ఉండాలి..


Ens Balu
4
Anantapur
2020-10-01 19:08:52

అనంతపురం నగరంలోని పాత ఆర్డీవో కార్యాలయం ఆవరణంలో ఏర్పాటుచేసిన ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈవీఎంలు, వివి ప్యాట్ లను తనిఖీ చేయాల్సి ఉండగా, అందులో భాగంగా గురువారం మధ్యాహ్నం ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదాము గదులను తెరిపించి అందులో భద్రపరిచిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను, వి వి ప్యాట్ లను జిల్లా కలెక్టర్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం తిరిగి గోదాముకు సీలు వేయించారు. అలాగే ఈవీఎంలు, వీవీ ప్యాట్ ల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉంటూ ప్రత్యేక నిఘా ఉంచాలని విధులు నిర్వర్తిస్తున్న పోలీసు మరియు సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గోడౌన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున గోదాములలోకి నీరు ప్రవేశించకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ భాస్కర్ కు జిల్లా కలెక్టర్ సూచించారు.