యుపీఎస్సీ పరీక్షలకు కంట్రోల్ రూమ్..


Ens Balu
3
Anantapur
2020-10-01 19:11:11

అనంతపురం జిల్లాలో యూపీఎస్సీ పరీక్షల కోసం జిల్లా కేంద్రంలో ఒక ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. యూపీ ఎస్సీ పరీక్షలు రాసే అభ్యర్థుల సౌకర్యార్థం యూపీఎస్సీ కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ను ప్రారంభించామని, కంట్రోల్ రూమ్ ను 08554-275598 అనే నెంబర్ తో ఏర్పాటు చేశామన్నారు. కంట్రోల్ రూమ్ ఇన్చార్జిగా ఒక తహసీల్ధార్, ముగ్గురు సిబ్బందిని నియమించామన్నారు. గురువారం నుంచి 4 వతేది వరకు ఈ కంట్రోల్ రూం పనిచేస్తుందన్నారు. అభ్యర్థులకు ఏవైనా ఇబ్బందులు వస్తే జిల్లా కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి తెలియజేయాలని సూచించారు. అభ్యర్థులు తెలియజేసిన సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే సమస్యలను యూపీఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేలా చూస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. పరీక్షలు రాసే అభ్యర్థులు కంట్రోల్ రూమ్ సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.