యుపీఎస్సీ పరీక్షలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు..
Ens Balu
3
Anantapur
2020-10-01 19:17:15
అనంతపురం జిల్లాలో యూపీఎస్సీ పరీక్షల కోసం అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఎస్కేయూ, జేఎన్టీయూ కళాశాలల్లోని పరీక్ష కేంద్రాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సుమంత్ ఆర్. ఆదోని తెలిపారు. ఈనెల 4వ తేదీన యూపీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆరోజు ఉదయం 6:30 గంటలకు అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ నుంచి జెఎన్టియుకి 3 బస్సులు, ఎస్కే యూనివర్సిటీకి 3 బస్సులు వెళ్లేందుకు సిద్ధంగా ఉంటాయన్నారు. ఉదయం 7 గంటలకు బస్సులు బయల్దేరి పరీక్ష కేంద్రాలకు 8: 30 గంటల లోపు చేరుకుంటాయని తెలిపారు. అదే రోజు సాయంత్రం 4:30 గంటలకు పరీక్షలు ముగిసిన వెంటనే పరీక్ష కేంద్రాల వద్ద బస్సులు సిద్ధంగా ఉంటాయని, 5 గంటలకు బయలుదేరి ఆర్టీసీ బస్టాండ్ కి చేరుకుంటారు. యూపీఎస్సీ అభ్యర్థుల సౌకర్యార్థం పరీక్ష కేంద్రాలకు రవాణా సౌకర్యం కల్పించడం కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశామని, ఈ అవకాశాన్ని అభ్యర్థులు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.