సత్యం, అహింస ప్రగతికి సోపానాలు..
Ens Balu
3
ఆంధ్రాయూనివర్శిటీ
2020-10-02 13:05:04
మహాత్మ గాంధీ ప్రబోధించిన సత్యం, అహింసలు ప్రగతికి సోపానాలుగా నిలుస్తాయని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం ఏయూ పరిపాలనా భవనం వద్దనున్న మహాత్మ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం మహాత్మ గాంధీ దేశ ప్రజలకు ఏకతాటిపై నిలపి, జరిపిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. సమిష్టిగా పనిచేస్తే సాధించగలమని ఆయన రుజువుచేసారన్నారు. అహింసా మూర్తికి నివాళి అర్పించారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య ఎస్.సమత, ఇంచార్జి రిజిస్ట్రార్ ఆచార్య జి.వి రవీంద్రనాథ్ బాబు, ప్రిన్సిపాల్స్ ఆచార్య పేరి శ్రీనివాస రావు, ఆచార్య కె.శ్రీనివాస రావు, ఆచార్య రాజేంద్ర కర్మార్కర్, ఆచార్య వై.రాజేంద్ర ప్రసాద్, ఆచార్య ఎస్.సుమిత్ర, ఆచార్య పి.హరి ప్రకాష్, పాలక మండలి సభ్యులు ఆచార్య టి.శోభశ్రీ, ఏయూఇయూ అద్యక్షులు డాక్టర్ జి.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉద్యోగులు, ఆచార్యులు పెద్దసంఖ్యలో పాల్గొని నివాళి అర్పించారు.