గాంధీజి ఆశయ సాధనకు కృషి చేయాలి..
Ens Balu
2
Vizianagaram
2020-10-02 13:56:22
జాతిపిత, మహాత్మాగాంధీ ఆశయాల సాధనకు కృషి చేయాలని డిఆర్‌డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ కె.సుబ్బారావు కోరారు. డాక్టర్ మర్రిచెన్నారెడ్డి భవనంలోని డిఆర్‌డిఏ కార్యాలయంలో, శుక్రవారం గాంధీ జయంతి సందర్భంగా మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పిడి సుబ్బారావు మాట్లాడుతూ మహాత్ముని గొప్పదనాన్ని వివరించారు. గ్రామీణ ప్రజల సౌభాగ్యమే గాంధీజి ధ్యేయమని పేర్కొన్నారు. సంక్షేమ ఫలాలను క్షేత్రస్థాయికి తీసుకు వెళ్లడమే మనందరి లక్ష్యమని పేర్కొన్నారు. అంకితభావంతో పనిచేసి, ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ అందించేందుకు సిబ్బంది అంతా కృషి చేయాలని పిడి కోరారు. కార్యక్రమంలో ఏపిడి మురళి, మేనేజర్ రోజా, డిపిఎంలు, ఎపిఎంలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.