నిలకడగా ద్రోణంరాజు శ్రీనివాస్ ఆరోగ్యం
Ens Balu
4
Visakhapatnam
2020-10-02 15:53:50
విఎంఆర్ డిఏ చైర్మన్ విశాఖ దక్షిణ వైఎస్సార్సీపీ సమన్వయకర్త ద్రోణంరాజు శ్రీనివాస్ ఆరోగ్యం మెరుగుపడుతుంది.గత 15 రోజులుగా ప్రముఖులు వైద్యుల పర్యవేక్ష ణలో శ్రీనివాస్ గారికి ప్రత్యేక చికిత్స జరుగుతోంది. తొలుత కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన ఇంట్లోనే ఉండి వైద్యం తీసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మళ్లీ కరోనా పరీక్షలు చేయడంతో నెగిటివ్ వచ్చింది. ఇప్పుడు ఆరోగ్యం నిలకడగా ఉందని శ్రీనివాసరావు సమీప బంధువు కావూరూ చరణ్ కుమార్ తెలియజేశారు. శ్రీనివాస్ ఆరోగ్యంపై వస్తున్న రూమర్లు... వదంతులు ఎవరూ నమ్మవద్దని ఆయన తెలిపారు. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు ఆయన హోమ్ ఐసోలేషన్ లోనే ఉండి వైద్యం పొందుతున్నారని అన్నారు. మరికొద్ది రోజుల చికిత్స అనంతరం ఎప్పటిలాగే ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆయన వివరించారు. ప్రస్తుతం ఇంటి దగ్గర కూడా ఎవరినీ కలవడం లేదని, 28 రోజులు పూర్తి అయిన దగ్గర నుంచి యధావిధిగా అందరినీ కలుస్తారని ఆయన వివరించారు.