స్మార్ట్ సిటీ పనులు సత్వరమే పూర్తిచేయాలి..
Ens Balu
3
Tirupati
2020-10-02 16:29:32
తిరుపతి స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తి చేయాలని కమిషనర్ గిరీషా ప్రాజెక్టు ప్రతినిధులను ఆదేశించారు. శుక్రవారం నాడు-నేడు, స్మార్ట్ సిటీ నిధులతో స్థానిక నెహ్రు మున్సిపల్ స్కూల్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను కమిషనర్ పరిశీలించారు. పనులు ఆలస్యంగా జరుగుతుండటంతో సంబం దించిన కాంట్రాక్టర్ల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఆడుకునేందుకు ఖో ఖో, కబుడ్డీ, వాలీబాల్ , బ్యాడ్మింటన్ క్రీడా మైదానాలు బాగా వచ్చాయన్నారు. స్కూల్ లోపల , బయట చుట్టు పక్కల పూల చెట్లు నాటి , పచ్చటి గడ్డితో లాన్ లు ఏర్పాటు చేయాలన్నారు. ఎస్పీజె ఎన్ ఎం స్కూల్ లో జరుగుతున్న పనులు రాష్ట్రానికే ఆదర్శం కావాలన్నారు. అనంతరం స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పనులు చేస్తున్న సంస్థ ప్రతినిధులతో సమావేశ మందిరంలో సమావేశమై ఏ ఏ ప్రాజెక్టు పనులు ఏ మేరకు పూర్తి అయ్యాయని పవర్ పాయింట్ ద్వారా తెలుసుకున్నారు. బాలాజీ కాలనీలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో గల ఈత కొలను, కాంటీన్, మరుగుదొడ్లు నిర్మాణం తదితర వాటి పురోగతిపై సమీక్షించారు. అలాగే వినాయక సాగర్ అభివృద్ధి పనులు, ప్రకాశం పార్క్ పనులు, రామాపురం వద్ద గల బయో మైనింగ్ ప్లాంట్, ట్రాన్స్ పర్ స్టేషన్ నిర్మాణ పనులు, 6 మెగా వాట్స్ సోలార్ ప్లాంట్ నిర్మాణ పనులు, 5 ఎం ఎల్ డి వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనుల పురోగతిపై సమీక్షించారు. ఇచ్చిన గడువు లోపు పనులు పూర్తి చేయాలన్నారు. మీ పనులను అప్పుడప్పుడు తనిఖీ చేస్తానని, పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. మీ బిల్లులు ఎప్పటికప్పుడు మంజూరు చేస్తున్నామని, మీరు కూడా అదే ఉత్సాహం తో పనులు పూర్తి చేయాలన్నారు. మీరు సకాలంలో పనులు పూర్తి చేయకుంటే బిల్లులు మంజూరు చేయబోమని, కాంట్రాక్ట్ క్యాన్సల్ చేస్తామని కాంట్రాక్టర్లు ను హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్ఈ చంద్రశేఖర్, డి.ఈ లు విజయకుమార్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, దేవిక, ఏయీకామ్ ప్రతినిధులు బాలాజీ, రాజేంద్ర, పలువురు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.