గాంధీజీ, లాల్ బహుదూర్ శాస్త్రిలకు ఘన నివాళి..


Ens Balu
4
జీవిఎంసీ గాంధీ సెంటర్
2020-10-02 20:14:10

జాతిపిత బాపూజి మహాత్మా గాంధీజి 151వ జయంతి, దివంగత మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి విశాఖలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం జివిఎంసి ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న  గాంధీజి, లాల్ బహుదుర్ శాస్త్రిల విగ్రహాలకు విశాఖ పార్లమెంటు సభ్యులు (రాజ్యసభ) వై. విజయ సాయిరెడ్డి, విశాఖ లోకసభ సభ్యులు ఎం.వి.వి.సత్యనారాయణ, అనకాపల్లి లోకసభ సభ్యురాలు డా. సత్యవతి, శాసన సభ్యులు టి. నాగిరెడ్డి, ఎ. అదీప్ రాజ్, జి. అమర్ నాద్, వాసుపల్లి గణేష్ కుమార్, జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన, జివిఎంసి అదనపు కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు పూలమాలలు వేసి ఘనంగా  నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధీజి, లాల్ బహుదూర్ శాస్త్రిల సేవలను కొనియాడారు. గాంధీజిని ప్రతీ ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. స్వాతంత్ర్య సమయంలో గాంధీజి పాత్రను మరోసాని నెమరువేసుకున్నారు.