గాంధీజీ ఆశయ సాధనకు కృషి..


Ens Balu
3
Srikakulam
2020-10-02 20:37:48

మహాత్మా గాంధీ ఆశయ సాధన, పోరాట పటిమ అందరికీ ఆదర్శ ప్రాయమని, ఆ దిశగా ప్రతిఒక్కరూ కృషిచేయాలని సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. పూజ్యబాపూజీ గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం ఉదయం కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూలమాలను వేసి నివాళులు అర్పించారు.  ఈ సందర్భంగా జె.సి మాట్లాడుతూ గాంధీజీ తాను నమ్ముకున్న ఆశయసాధన కోసం అహింసనే ఆయుధంగా  పోరాటం చేసి విజయాన్ని సాధించారని చెప్పారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం రెవిన్యూ శాఖకు అప్పగించిన పనులను  సకాలంలో నిర్వహించి విజయం సాధించాలని జె.సి ఆకాంక్షించారు. అనంతరం సిబ్బందికి మిఠాయిలు పంచిపెట్టారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి, భూరికార్డులు మరియు సర్వే శాఖ సహాయ సంచాలకులు కె.ప్రభాకర్, కలెక్టర్ కార్యాలయం పరిపాలన అధికారి, కలెక్టర్ కార్యాలయ వివిధ విభాగాలకు చెందిన పర్యవేక్షకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.