ఒక్క అడుగు స్వచ్ఛత వైపు వేయాలి..
Ens Balu
12
Visakhapatnam
2020-10-02 20:41:58
"ఒక్క అడుగు స్వచ్ఛత వైపు" అనే నినాదంతో స్వచ్ఛభారత్ కార్యక్రమాల ద్వారా జాతిపిత మహాత్మాగాంధీ కలలు సాకారమవుతున్నాయని, దేశమంతా పరిపూ ర్ణమైన స్వచ్చత కలిగి ఉంటుందని రాజ్యసభ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి వి. విజయసాయి రెడ్డి అన్నారు. శుక్రవారం గురజాడ కళాక్షేత్రం లో జాతిపిత మహాత్మాగాంధీ 151 వ జన్మదినోత్సవం సందర్భంగా మహా విశాఖ నగరపాలక సంస్థ ప్రగతి భారత్ ఫౌండేషన్ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన విశాఖ స్వచ్ఛ మహోత్సవ్ 2020 కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యులు వి. విజయసాయిరెడ్డి గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ విశాఖ స్వచ్ఛ మహోత్సవం కార్యక్రమానికి హాజరైన విశాఖ జిల్లా పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యుల జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన కలిసి ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలను గౌరవ అతిథి వి. విజయసాయిరెడ్డి సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ముందుగా గౌరవ అతిధి మాట్లాడుతూ మన జాతిపిత మహాత్మా గాంధీ 151వ జయంతి దినోత్సవం జరుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. మహాత్మా గాంధీ ఆశయాలైన భారతదేశం పరిపూర్ణత స్వచ్ఛత కలిగి ఉండాలని, ప్రజలు జీవన విధానం పర్యావరణానికి అనుకూలంగా ఉండాలనే కలలను సాకారం చేసే దిశగా భారత ప్రధానమంత్రి, మహాత్మా గాంధీ జయంతి 2014 అక్టోబర్ రెండో తేదీన స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ స్వచ్ఛభారత్ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. భారతదేశంలో 1981వ సంవత్సరంలో పరిశుభ్రత ఒక శాతం ఉండేదని అది 2013 నాటికి 32 శాతం కాగా 2014 సంవత్సరం నుండి శతశాతం వైపు అడుగులు వేస్తుందన్నారు. అలాగే బహిరంగ మల మూత్ర విసర్జన 550 మిల్లియన్లకు గాను ఇప్పుడు 50 మిలియన్లకు తగ్గిందని, 607 జిల్లాలు, 613 వేల గ్రామాలు బహిరంగ మల మూత్ర విసర్జన రహిత ప్రాంతాలుగా గుర్తింపు పొందాయన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ 2020 లో విశాఖ నగరం పరిశుభ్ర నగరంగా 9వ ర్యాంకు సాధించడం అభినందనీయమన్నారు. అందుకు కృషి చేసిన పారిశుధ్య కార్మికులు, సహకరించిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
విశాఖ నగరానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తుందన్నారు. నగరంలో కాలుష్యం లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. కాలుష్యాన్ని అరికట్టేందుకు ఈ నగరంలో ప్రజల పరిపూర్ణ ఆరోగ్య జీవన విధానానికి, పర్యావరణానికి అనుకూలంగా,పచ్చదనం నిండి ఉండేటట్లుగా ఈరోజు ప్రగతి భారత్ ఫౌండేషన్ - ఇండియన్ నేవీ, మహా విశాఖపట్నం నగర పాలక సంస్థవారి సహకారంతో హెలికాప్టర్ ద్వారా ఒక లక్ష విత్తన బంతులు నగరంలో వివిధ ప్రాంతాలలో నాటడమైనదన్నారు. అలాగే ప్రజల శ్రేయస్సుకై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.యస్. జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పథకాలు ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నారని, సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించి నేటికి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నదన్నారు. రాష్ట్రంలో మద్యపాన నియంత్రణకు ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చర్యలు చేపట్టారన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్-2021, విశాఖనగరం ప్రథమ స్థానం వైపు అడుగులు వేయాలని అందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక కృషితో ప్రజల సహకారంతో సాధించాలన్నారు. అనంతరం జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి.సృజన మాట్లాడుతూ ఈ దేశానికి మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి సేవలను కొనియాడారు. స్వచ్ఛ సర్వేక్షన్-2020 నగరానికి తొమ్మిదో స్థానం సాధనకు సేవలందించిన పారిశుద్ధ్య కార్మికులకు, ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. నగరంలో కాలుష్యం అదుపు చేయుటకై, పచ్చదనం పెంపొందించేందుకు ఇండియన్ నేవీ సహకారంతో ప్రగతి భారత్ పౌండేషన్ ఒక లక్ష విత్తన బంతులు హెలికాప్టర్ సహాయంతో నగరంలో చెల్లించడం చాలా సంతోషాన్నిచ్చింది అన్నారు. ఈ రోజు మహాత్మాగాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వార్డు సచివాలయాల వ్యవస్థ ప్రథమ వార్షికోత్సవం కూడా జరుపుకుంటున్నారు. ప్రజలకు హక్కుగా అందించవలసిన పౌర సేవలు కార్యదర్శులు, వాలంటీర్ల ద్వారా అందించే విధంగా ప్రత్యేక వ్యవస్థను రూపొందించిన గౌరవ ముఖ్యమంత్రిగారి ఆలోచనలకు అభినందనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వారి ఆదేశాల మేరకు ఈ రోజు రాత్రి 7 గంటలకు వార్డు కార్యదర్శులు, ప్రజలు ఒకేసారి చప్పట్లతో ఈ సేవలకు తమ చప్పట్లతో కృతజ్ఞతలు తెలిపాలన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్-2021 లో విశాఖనగరం పరిశుభ్ర నగరాల జాబితాలో ప్రధమ స్థానం సాధనకు ప్రజల భాగస్వామ్యంతో జీవీఎంసీ కృషి చేస్తోందన్నారు.
అనంతరం దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ COVID-19 వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తన ప్రాణాలను పణంగా పెట్టి ప్రత్యేక సేవలు అందించిన పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలందరూ పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ నగర అభివృద్ధికి సహకరించాలని అన్నారు. అనంతరం శాసన మండలి సభ్యులు పి.వి.ఎన్ మాధవ్ మాట్లాడుతూ దేశానికి స్వతంత్రాన్ని అందించిన మహాత్మాగాంధీ సేవలను కొనియాడారు. వారి కలలను సాకారం చేసే దిశగా ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమానికి ప్రజలు సహకరిస్తూ విశాఖ పరిశుభ్ర నగరంగా ప్రథమ స్థానంలో నిలపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛభారత్ పథకమే ఒక ఉద్యమంగా భావించి ప్రతి ఒక్కరు సైనికుడిగా మారి పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అనంతరం అనకాపల్లి పార్లమెంటు సభ్యులు మాట్లాడుతూ విశాఖ నగరానికి 9వ స్థానంకు సహకరించిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజల సేవలకు సచివాలయ వ్యవస్థ ఒక వారధి అని తెలిపారు. అనంతరం విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎంపీపీ సత్యనారాయణ మాట్లాడుతూ మన విశాఖ నగరం అతి సుందర నగరమని, దేశంలో ఎక్కడ ఉన్న వారైనా చివరకు విశాఖలోని స్థిర పడాలనుకుంటారన్నారు. ప్రజల భాగస్వామ్యంతో విశాఖ నగరాన్ని మరింత అభివృద్ధి పరచవచ్చన్నారు.చెత్తను బహిరంగంగా పారవేయకుండా రోజూ జివిఎంసి సిబ్బందికి అందించాలన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పచ్చదనానికి ప్రాధాన్యతనిస్తూ పర్యావరణానికి సహకరించాలన్నారు. అనంతరం విశాఖ అంబాసిడర్ వి.వి.రమణ మూర్తి మాట్లాడుతూ విశాఖ నగరంలో జీవించడం చాలా అదృష్టం అని పర్యావరణానికి ప్రజల జీవన విధానానికి సరైన నగరమన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమోఘమని. ప్రజల సహకారంతో విశాఖనగరం మెరుగైన స్థానం సంపాదిస్తుంది అని తెలిపారు. అందుకు కృషి చేసిన జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి. సృజనకు ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జి ఆర్ నగర్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె.ఎస్.ఎన్ మూర్తి మాట్లాడుతూ ఏ.పి.ఎఫ్.ఇ.ఆర్.డబ్ల్యూ.ఏ.ఎస్. ద్వారా నివాసిత సంక్షేమ సంఘాలు విశాఖ నగర అభివృద్ధికి నిత్యం సహకరిస్తున్నాయన్నారు.
అనంతరం స్వచ్ఛ సర్వేక్షన్లో లఘు చిత్రాల పోటీలో ఎంపికైన "ప్లాస్టిక్ పిశాచి" అనే లఘు చిత్రానికి ప్రథమ బహుమతి యడ్లపల్లి సంతోష్ కుమార్ కు గౌరవ అతిధి వి. విజయసాయి రెడ్డి అందించారు. స్వచ్ఛ సర్వేక్షన్-2021లో ప్రజల అవగాహన కొరకు కరపత్రాలను గౌరవ అతిధి విడుదల చేశారు. స్వచ్ఛ సర్వేక్షన్ లో ప్రత్యేక సేవలు కనపరచిన పారిశుద్ధ్య కార్మికులకు, పరిశ్రమలకు, ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు, హోటల్స్ లకు, ఆసుపత్రులకు, ఎస్.ఎల్.ఎఫ్ సభ్యులకు, ఎన్జీవోలకు, బల్క్ వేస్ట్ జనరేటర్ లకు, నివాసిత సంక్షేమ సంఘాలకు, ఎస్.హెచ్.జి. లకు, మార్కెట్లకు, వార్డు శానిటేషన్ ఎన్విరాన్మెంట్ కార్యదర్శులకు గౌరవ అతిధి ప్రశంసాపత్రాలు అందించి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్, అదీప్ రాజ్, తిప్పల నాగిరెడ్డి, వైకాపా నాయకులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, స్వచ్ఛ విశాఖ అంబాసిడర్ డాక్టర్ పి. విశ్వేశ్వరరావు, సినీ నటుడు మరియు లఘు చిత్రాల ఎంపిక న్యాయనిర్ణేత ఐ. ప్రసన్న కుమార్, జీవీఎంసీ ప్రధాన ఇంజనీర్ వెంకటేశ్వర్లు, అదనపు కమిషనర్లు డాక్టర్ వి. సన్యాసిరావు, ఆర్.సోమన్నారాయణ, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ కె. ఎస్. ఎల్. జి. శాస్ట్రీ, సహాయ వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.