గాంధీజి కలలుగన్న స్వరాజ్య స్థాపనే లక్ష్యం..


Ens Balu
3
Chittoor
2020-10-02 20:48:47

ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటయిన  సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివ్రుద్ది   శాఖ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి తిరుపతి లోని తన నివాసం వద్ద ముఖ్యమంత్రి  వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు అయి  సంవత్సరం పూర్తయిన సందర్భంగా చప్పట్లు   కొట్టాలని సూచించిన మేరకు కార్యక్రమం నిర్వహణ జరిగింది. తొలుత సచివాలయ సిబ్బంది, వాలిఁటర్లు కొవ్వొత్తుల ప్రదర్శన తో ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, మంత్రికి పెద్ద ఎత్తున అభినందనలు తెలియజెసారు.   పంచాయితీ రాజ్, గ్రామీణాభివ్రుద్ది   శాఖ మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి పాదయాత్రలొ ఇచ్చిన మాట మేరకు  ఇంటి ముందుకే పాలన తీసుకురావాలని గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యాన్ని గత సంవత్సరం అక్టొబర్ 2 న గ్రామ సచివాలయం వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.  సచివాలయ వ్యవస్థ ప్రారంభించి నేటికి సంవత్సరం పూర్తి అయిందని అన్ని వర్గాలకు ప్రభుత్వ పథకాలు అందజేసి   చాలా బాగా పని చేశారు,  అందుకే వారి పనికి  మనము ఈ రోజు సంవత్సరం పూర్తయిన సందర్భంగా చప్పట్లు  కొట్టాలని ఏదైతే ముఖ్యమంత్రి తెలిపారో ఆచరణ చేపట్టామని అన్నారు. ఏ రాష్ట్రంలో కూడా ఈ వ్యవస్థ లేదు, ప్రధానమంత్రి గారు అభినందించిన విషయం తెలిందేనని అన్నారు.  ఈ సచివాలయ వ్యవస్థ మన రాష్ట్రంలోనే ప్రధమం గా మొదలు పెట్టామని,   ఈరోజు యుపిఎస్  ఎగ్జామ్స్ లోనూ , సెలెక్ట్ ట్రైనింగ్ లో కూడా దీనిని పాఠ్యాంశంగా చేర్చడం  చాలా గొప్ప విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఈజీఎస్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ ముత్యం శెట్టి విశ్వనాధ్, జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) వి. వీరబ్రహ్మం, తిరుపతి ఆర్ డి వో కనక నరసారెడ్డి, డ్వామా, డి ఆర్ డి ఎ పి డి లు చంద్రశేఖర్, తులసి, జెడ్పీ సీఈవో ప్రభాకర్ రెడ్డి, మెప్మా పిడి జ్యోతి, పుంగునూరు మునిసిపల్ కమిషనర్ వర్మ, ప్రజా ప్రతినిధులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొన్నారు.