సబ్బం పబ్బం గడిపిన ఆక్రమణ కూల్చివేత..!
Ens Balu
2
Seethammadara
2020-10-03 11:52:53
విశాఖ మాజీ మేయర్, మాజీ ఎంపీ సంబ్బం హరి జీవిఎంసీ పార్కు స్థలాన్ని ఆక్రమించి అడ్డంగా కట్టేసి పబ్బం గడిపిన నిర్మాణాలను జీవిఎంసీ అధికారులు ఒక్కపెట్టున కూల్చేశారు. ఇన్నాళ్లూ సబ్బంహరి వాటిని అక్రమంగా ఆక్రమించి నిర్మాణాలు చేసిన విషయం అధికారులకి తెలిసినప్పటికీ వివిధ సాకులతో జీవిఎం అధికారులు, అటువైవపు వెళ్లేవారు కాదు. ఇక సబ్బం అనుకూల మీడియా అయితే అతనికి భజన చేయడానికే సరిపోయేది. పైగా ఎవరైనా ఈ ఆక్రమణల విషయం వార్త రాయాలని చూస్తే సబ్బం అనుచర మీడియానే వార్త రాయాలని చూసే వారిని బెదిరిస్తూ వచ్చేది. ’కాలం కలిసొస్తే అధికారం చలాయించే రోజుస్తుందన్నట్టు’... ఇన్నేళ్లు ఆక్రమణ స్థలంలో పబ్బం గడిపేసిన సబ్బం హరి ఆక్రమ నిర్మాణం కూల్చివేయడం విశాఖలో చర్చనీయాంశం అవుతుంది. చేసిందే ఆక్రమణ అయినప్పటికీ కూల్చివేసే సమయంలో జివిఎంసి ఎందుకు నోటీసు ఇవ్వలేదని సబ్బం అరిచిగోల చేసినా.. జీవిఎంసీ అధికారులు కనీసం పట్టించుకోకుండా వేకువజామునే జేసీబీలు తీసుకొచ్చి మరీ కూల్చేయడం విశాఖలోని రాజకీయవర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. జీవిఎంసీ అధికారులు ఆక్రమణ స్థలయంలో కట్టడాన్ని కూల్చేయడంతో పాటు అక్కడ హెచ్చరికబోర్డులు పెట్టడంతో ఆ ప్రాంతంలో ఆక్రమణలు చేసిన వారికి సైతం ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసినట్టు అయ్యింది. అయితే ఇన్నేళ్ల పాటు సబ్బం జోలికి వెళ్లని జీవిఎంసి అధికారులు..ఇపుడు వెళ్లి నోటీసుకూడా ఇవ్వకుండా ఆక్రమణలు కూల్చివేయడం కూడా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది.