ఈ-రిక్వెస్టుల్లో రాష్ట్రంలోనే ముందుంది..
Ens Balu
3
Vizianagaram
2020-10-03 13:42:04
సచివాలయాల ద్వారా ప్రజలకు సకాలంలో సేవలను అందించడంలో ఇతర జిల్లాలకు విజయనగరం జిల్లా ఆదర్శంగా నిలిచింది. ఇ-రిక్వెస్టులన్నీ నిర్ణీత గడువు కంటే ముందుగానే పరిష్కరిస్తూ, రాష్ట్రంలోనే మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. అలాగే గడువు దాటిన తరువాత పరిష్కరించిన వినతుల విషయంలో కూడా, అతితక్కువ సంఖ్యతో ఇతరజిల్లాకంటే ముందంజలో ఉంది. గ్రామ, వార్డు సచివాలయాలే ఇప్పుడు ప్రభుత్వవ సేవలకు కేంద్ర బిందువులు. ప్రస్తుతం సుమారు 500కు పైగా ప్రభుత్వ సేవలు సచివాలయాల ద్వారా అందుతున్నాయి. ప్రజలు ప్రతీ ప్రభుత్వ సేవ పొందేందుకూ నిర్ణీత కాలవ్యవధిని నిర్ణయించింది ప్రభుత్వం. దానికి తగ్గట్టుగా నిర్ణీత గడువులోగా , ఆయా సేవలను అందించేందుకు జిల్లా యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తోంది. ఇప్పటివరకూ జిల్లా వ్యాప్తంగా 4లక్షల, 82వేల, 947 ఇ-రిక్వెస్టులు రాగా, వాటిలో 3లక్షలా, 99వేల 599 వినతులను నిర్ణీత కాలవ్యవధిలోపలే పరిష్కరించడం జరిగింది. ఈ విషయంలో రాష్ట్రంలో మన జిల్లా గత కొంతకాలంగా నెంబరు 1గా కొనసాగుతోంది. కొన్ని రకాల సేవలను వివిధ కారణాల రీత్యా నిర్ణీత గడువులోగా అందించడం సిబ్బందికి సాధ్యపడటం లేదు. అయినప్పటికీ ఇలాంటి సుమారు 61,173 వినతులను గడువు దాటినప్పటికీ, పరిష్కరించడం జరిగింది.
సచివాలయాల ద్వారా అందిన వినతులను సంబంధిత ప్రభుత్వ విభాగాలు గడువు లోపల పరిశీలించాల్సి ఉంటుంది. వినతులను పరిశీలించే అంశంలో కూడా ఇతర జిల్లాలకు మార్గదర్శకంగా నిలిచింది మన జిల్లా. గడువు దాటిన తరువాత పరిశీలించిన ధరఖాస్తులు కేవలం 1860 మాత్రమే. రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశంలో అతి తక్కువ వినతులతో మన జిల్లా ప్రధమ స్థానంలో ఉండగా, విశాఖ, వైఎస్ఆర్ కడప, శ్రీకాకుళం జిల్లాలు తరువాత స్థానాల్లో ఉన్నాయి. 13,047 వినతులతో ప్రకాశం జిల్లా 13వ స్థానంలో ఉంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ నిరంతర పర్యవేక్షణలో, జిల్లాలో అందిన వినతులను ఎప్పటికప్పుడు పరిశీలించి, వాటిని పరిష్కరిస్తుండటంతో రాష్ట్రస్థాయిలో ప్రశంసలు లభిస్తున్నాయి.