తిరుపతిని మరింత అందంగా తీర్చిదిద్దాలి..


Ens Balu
3
Tirupati
2020-10-03 13:59:20

తిరుపతి నగరపాలక సంస్థ  పరిధిలో పాఠశాలలు ప్రారంభం అయ్యేనాటికి  మనబడి-నాడు నేడు పనులు మొత్తం పూర్తి చేయాలని కమిషనర్ గిరీష అధికారులను ఆదేశించారు. శనివారం ఈ మేరకే సంస్థ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.  పాఠశాలలో పండగ వాతావరణం, ఆహ్లాదకరంగా అందమైన రంగులు, అవగాహన కలిగించే అందమైన బొమ్మలు ఉండాలని, అన్ని స్కూళ్లలో అందమైన చెట్లు నటించాలన్నారు. నిరంతర వసతితో మరుగుదొడ్లు, ప్రతి గదికి ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, రక్షిత తాగునీరు, విద్యార్థులకు ఉపాధ్యాయులకు, ఫర్నీచరులు నాణ్యతతో ఉండాలని ఆదేశించారు. మనబడి, నాడు – నేడు చేపట్టే ప్రతి పనిలో నాణ్యత వుండాలని, తొమ్మిది అంశాలుతో పాఠశాల్లో  ఆరు కోట్ల రూపాయల వ్యయంతో మొదటి విడత పాఠశాల అభివృద్ధి చేయాలన్నారు.  పేద విద్యార్థులకు చదువులకు కార్పొరేట్ స్థాయి పాఠశాలల దీటుగా ప్రభుత్వ పాఠశాల మెరుగుపరచాలన్న కమిషనర్ పాఠశాలల్లో జరుగుతున్న పనులు,  వారం లోపల పూర్తిచేసి  ప్రతి స్కూల్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలనిన్నారు. చేస్తున్న పనులు ప్రధానోపాధ్యాయులు  ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రాధమికోన్నత పాఠశాలలు,నగర పాలక ఉన్నత పాఠశాలలు మొత్తం 44 స్కూల్స్ ఉన్నాయని మొదటి విడత 16 మున్సిపల్ పాఠశాలల్లో,6 జిల్లా పరిషత్ పాఠశాలలు మొత్తం 22 పాఠశాలలు జరుగుతున్న పనులన్నింటినీ వారం లోపల పూర్తి చేసి మన తిరుపతి ఆదర్శంగా నిలచేలా చూడాలన్నారు. ప్రతి హెచ్ఎంలు( స్కూల్ ట్రాన్స్ఫర్ రేషన్ మానిటరింగ్ సిస్టం యాప్) ఎస్ టి ఎం ఎస్ యాప్ డౌన్లోడ్ చేసి ఎప్పటికి అప్పుడు ఫోటోలు అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ హరిత, ఎస్ఈ చంద్రశేఖర్, డివైఈవో జనార్దన్ రెడ్డి, స్కూల్ సూపర్వైజర్లు ప్రభు కుమార్, హరికృష్ణ బాబు, మహాలక్ష్మి, నగరపాలక సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రఘు కుమార్, చంద్రశేఖర్రెడ్డి,రవీంద్రనాథ్రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, గోమతి, దేవిక,ఏఈలు శంకర్ రెడ్డి, తేజస్విని, ఏక్నాథ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.