వైఎస్సార్ ఉచిత విద్యుత్ పై అపోహలొద్దు..


Ens Balu
5
Tirupati
2020-10-03 14:28:48

ప్రభుత్వ నవరత్నాలలో భాగంగా రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రధాన ఉద్దేశ్యమని తిరుపతి ఆర్డీఓ కనకనరసా రెడ్డి అన్నారు. శనివారం కార్యాల యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో  వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ, ఈ పధకాన్ని నగదు బదిలీతో అనుసంధానం చేయనున్నారని, రైతులకు ఎలాంటి అపోహలు పెట్టుకోకూడదని స్పష్టం చేశారు.  2004 లో దివంగత డా. వై.ఎస్.రాజశేఖర రెడ్డి రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేస్తూనే.. నవరత్నాలలో భాగంగా ఇప్పటికే రాత్రి, పగలు  గతంలో ఇస్తున్న విద్యుత్ ను పగలే 9 గంటలు  అందిస్తున్నారని తెలిపారు. ఈ పథకం నగదు బదిలీతో అనుసంధానం చేయడం వల్ల రైతుకు ఒక రూపాయి కూడా ఖర్చు ఉండదని రైతులు విద్యుత్ వాడినా వాడకున్నా ప్రభుత్వం రాయితీ ప్రతి సంవత్సరం డిస్కమ్ లకు రూ.8500 కోట్లు  చెల్లిస్తున్నదని ఒక రాయలసీమ జిల్లాల వాటా రూ.5300 కోట్లు గా ఉన్నదని అన్నారు. గతంలో రైతు విద్యుత్ ఇచ్చినా ఇవ్వకున్నా ప్రశ్నించే  తత్వం లేకున్నదని నగదు బదిలీతో జవాబుదారీ తనంతో పాటు విద్యుత్ అవసరమెంత తెలుస్తుందని ఆ మేరకు నాణ్యమైన విద్యుత్ అందించే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ పథకంలో కొత్తగా నమోదు, పాత వారి పేర్లు ప్రస్తుతం ఉన్న వారి పేరుకు  మార్పు, అనధికార కనెక్షన్లు రేగులరైజేషన్ చేసుకోవచ్చని  అన్నారు. మొదటిసారిగా ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను ఈ పథకానికి అనుసంధానం చేసి పటిష్టంగా అమలు చేయనున్నదని అన్నారు. గ్రామ స్థాయి కమిటీలో వీ ఆర్ ఓ అధ్యక్షులుగా లైన్ మాన్ మెంబర్ గా ఉంటారని, నమోదు చేస్తున్నవారికి బ్యాంకు ఖాతా కొత్తది ప్రారంభిస్తారని ఇది కేవలం ఒక విద్యుత్ బిల్లులు మీటర్ ప్రకారం ఎంత వచ్చింది, ప్రభుత్వం ఎంత చెల్లిస్తున్నదని తెలియడానికే  అని అన్నారు. జిల్లాలో ఇప్పటికే 2,89,544 కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు. గ్రామ స్థాయిలో వీఆర్ఓ లు, మండల స్థాయిలో తహసీల్దార్లు, డివిజన్ స్థాయిలో ఆర్డీఓ లు పథక అధ్యక్షులుగా ఉంటారని, సచివాలయంలో నమోదు చేసుకోవాలని సూచించారు. పెద్ద ఎత్తున ప్రచారం కల్పించనున్న నేపథ్యంలో పోస్టర్లు, కరపత్రాలు ప్రతి రైతు ఇంటికీ పంపిణీ చేపట్టి అవగాహన కల్పించాలని సూచించారు.  విద్యుత్ శాఖ ప్రచురించిన పోస్టర్ లు, కరపత్రాలు ఆర్డీఓ , విద్యుత్ శాఖ అధికారులు ఆవిష్కరించారు. 2020-ఆర్థిక సంవత్సరం నుండి అమలు కానున్నది తెలిపారు. ఈ అవగాహన సదస్సులో డి ఎల్ పి ఓ ఉపేంద్ర రెడ్డి, తిరుపతి డివిజన్ స్థాయి విద్యుత్ శాఖ అధికారులు, కన్వీనర్లు  వాసుదేవ రెడ్డి, కృష్ణారెడ్డి , మురళి , ఎడిఇ  లు, ఎఇ లు  భీమేశ్వర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, హరి, శేషాద్రి రెడ్డి, శ్రీనివాసుల నాయుడు,  తహశీల్దార్ లు హజారుద్దీన్, వెంకటేశులు, గణేష్, వెంకటరమణా రెడ్డి, శివ ప్రసాద్, డీటీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.