16 నుంచి నన్నయ్య వర్శిటీ సెట్ 2020
Ens Balu
2
Rajahmundry
2020-10-03 15:31:03
ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం పీజీ ప్రవేశాల కొరకు ఈ నెల 16వ తేదీ నుండి 19వ తేది వరకు “నన్నయ సెట్-2020” పరీక్షలను నిర్వహిస్తున్నామని వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావు చెప్పారు. విశ్వవిద్యాలయంలో శనివారం నన్నయ సెట్ 2020 పరీక్షలకు సంబంధించిన టైం టేబుల్ ను వీసీ విడుదల చేసారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ రాష్ట్రంలోనే అతిపెద్ద విశ్వవిద్యాలయమైన ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం నన్నయ సెట్ 2020 పరీక్షలను ఈ నెల 16వ తేది నుండి 19వ తేది వరకు నిర్వహిస్తున్నామని అన్నారు. నన్నయ సెట్ కొరకు 6810 మంది విద్యార్థులు దరఖాస్తూ చేసుకున్నారని తెలిపారు. కోవిడ్ నేపధ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళికను రూపొందించామని చెప్పారు. పరీక్ష కేంద్రాలను పెంచామని ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, విశాఖపట్నంతో కలిపి 10 నన్నయ సెట్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసామన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఎం.ఎస్.ఎన్ క్యాంపస్ కాకినాడ, ఎస్.కె.వి.టి కాలేజ్ రాజమహేంద్రవరం, ఎస్.కె.బి.ఆర్ కాలేజ్ అమలాపురం, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ రంపచోడవరం, పశ్చిమగోదావరి జిల్లాలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ క్యాంపస్ తాడేపల్లిగూడెం, శ్రీ సి.ఆర్.రెడ్డి పీజీ కాలేజ్ ఏలూరు, కె.జీ.ఆర్.ఎల్ పీజీ కాలేజ్ భీమవరం, శ్రీరామచంద్రా డిగ్రీ కాలేజ్ జంగారెడ్డిగూడెం, విశాఖపట్నంలోని గాయత్రి విద్యాపరిషత్ కాలేజ్, విజయవాడలోని ఎస్.ఆర్.ఆర్ & సి.వి.ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లలో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. అలాగే కోవిడ్ నిబంధనలను అనుసరించి భౌతికదూరం పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని నాలుగు రోజు పాటు ఉదయం 9.30 నుండి 11.00 వరకు, మధ్యాహ్నం 2.30 నుండి 4.00 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయన్నారు. 16వ తేదీన ఉదయం లైఫ్ సైన్సెస్(101), మధ్యాహ్నం మ్యాథ్మెటిక్స్(103), జియాలజీ(105), 17వ తేదిన ఉదయం ఫిజికల్ సైన్సెస్(102), మధ్యాహ్నం కంప్యూటర్ సైన్సెస్(106), 18వ తేదిన ఉదయం కెమికల్ సైన్సెస్(104), మధ్యాహ్నం హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్(201), 19వ తేదిన ఉదయం ఇంగ్లీషు(202), ఎం.పి.ఈడీ(205), మధ్యాహ్నం హిందీ(204), తెలుగు(203) పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఈ నెల 7వ తేది నుండి హాల్ టికెట్లును డౌన్ లోడ్ చేసుకోవచ్చునని చెప్పారు. కోవిడ్ నింబందనలు తప్పని సరిగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. అలాగే విద్యార్థులు కూడా వ్యక్తిగత జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షలకు హాజరు కావాలని చెప్పారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబి సైట్ www.aknu.edu.in ను లేదా 7093008477 నెంబర్ ను సంప్రదించాలని తెలియజేసారు.