రూర్భన్ పనులు త్వరగా పూర్తిచేయండి..
Ens Balu
3
Eluru
2020-10-03 15:48:07
రూర్బన్ మిషన్ క్రింద చేపట్టిన ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టిసారించాలని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు సంబందిత అధికారులను ఆధేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పథకం అమలుపై సంబందిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పట్టణ సౌకర్యాలను కల్పించి గ్రామీణ ప్రాంతాల నుండి వలసలను నివారించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నెషనల్ రూర్బన్ పథకం అమలుకు 100 కోట్ల రూపాయిల విలుగల కార్యాచరణ రూపొందిచడం జరిగిందన్నారు. 2017-18 ఫెజ్-3లో పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు రూర్బన్ క్లస్టర్ క్రింద ఎంపికకావడంతో ఏలూరు పరిదిలోని 15 గ్రామ పంచాయితీలను క్లస్టర్ క్రింద తీసుకోవడం జరిగిందన్నారు. మలకాపురం, సిరిపురం, కలకుర్రు, కోమటిలంక, గుడివాకలంక, ప్రత్తికోళ్లలంక, పైడిచింతలపాడు, మెండికోడు, కొక్కిరిలంక, కె.దుర్గాపురం, చాటపర్రు, పెదయాగానమిల్లి, జాలిపూడి, కాట్లంపూడి, మాదేపల్లి క్లస్టర్‌లో వున్నాయన్నారు. ఈ పధకం అమలుకు 30 శాతం కేంద్ర నిధులతోపాటు సంబందిత శాఖల పనులకు కన్వర్జెన్సీ క్రింద 70 శాతం ఫండింగ్ వుంటుందన్నారు. ఆయా గ్రామాలలో నిరంతర నీటి సరఫరా, విద్యుత్, సోషల్ ఇన్ఫస్ట్రక్చర్, గ్రామీణ రోడ్లుకు అనుసంధానంగా డ్రైన్స్ నిర్మాణం, నైపుణ్యాభివృద్ధి, ఆర్ధికవ్యవహారాలపై ప్రత్యేక శిక్షణ, సాలిడ్ లిక్విడ్ వెస్టు మేనేజ్‌మెంట్, పౌర సేవలకోసం ఎలక్ట్రానిక్ ఆధారిత పౌర సేవా కేంద్రాలు ఏర్పాటు, వైద్యం, గ్రామీణ వ్యవసాయాన్ని ప్రొత్సహించేందుకు ఆగోప్రాసెసింగ్, స్టోరేజ్, వేర్‌హౌసింగ్ వంటి సదుపాయాలు, పర్యాటకం, పారిశుద్ధ్యం వంటి 13 ఆంశాల ఏర్పాటుకు గుర్తించి కార్యాచరణ రూపొందించడం జరిగిందన్నారు. పనులు ఆమోదం, చేపట్టడంలో సంబందిత అధికారుల అలసత్వం కనిపిస్తుందని పని తీరుమార్చుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ చహట్ బాజ్‌పేయి, జిల్లా పరిషత్ ఇన్‌ఛార్జి సిఇఓ,ఇన్‌ఛార్జి డ్వామా పిడి వై.పరదేశీ కుమార్, ఇన్‌ఛార్జి డిపిఓ జె.ఉదయ భాస్కర్, ఎస్.ఇ పంచాయితీరాజ్ జి.చంద్రభాస్కరరెడ్డి, ఎస్.ఇ ఆర్‌డబ్ల్యుఎస్ ఎ.వి.రాఘవులు, ఏలూరు ఎంపిడిఓ జి.ఆర్.మనోజ్, తదితరులు పాల్గోన్నారు.