5న చక్కెర ఖర్మాగాల సందర్శన..
Ens Balu
3
కలెక్టరేట్
2020-10-03 18:42:21
రాష్ట్రంలోని సహకార చక్కెర కర్మాగారాల పునరుద్దరణపై ఏర్పాటైన మంత్రుల బృందం ఈనెల 5న విజయనగరం జిల్లా భీమసింగిలోని విజమరామ గజపతి సహకార చక్కెర కర్మాగారాన్ని సందర్శించనున్నట్టు జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టరేట్ లో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, పరిశ్రమలు, పెట్టుబడులు, వాణిజ్యం, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి మేకపాటి గౌతం రెడ్డిలతో కూడిన బృందం 5వ తేదీ మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు భీమసింగి చక్కెర కర్మాగారాన్ని సందర్శిస్తుందని కలెక్టర్ తెలిపారు. అనంతరం విశాఖ జిల్లా చోడవరం సహకార చక్కెర కర్మాగారం సందర్శనకు బయలుదేరి వెళతారని తెలిపారు. మంత్రుల కమిటి చక్కెర ఖర్మాగారాలను సందర్శించి అక్కడ వాస్తవ పరిస్థితిని ప్రభుత్వానికి నివేదిస్తుందని అన్నారు. మంత్రుల రాక సందర్భంగా అధికారికంగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు జిల్లా కలెక్టర్ వివరించారు.