తిరుపతి అభివ్రుద్ధికి సహకరించండి..
Ens Balu
3
Tirupati
2020-10-03 18:45:25
తిరుపతి నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ప్రతి ఒక్కరు సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ గిరీషా కోరారు. కొర్లగుంట గురవారెడ్డి సమాధులు నుండి రేణిగుంట రోడ్డులోని హీరో హొండా షో రూమ్ వరకు నిర్మిస్తున్న డి.బి.ఆర్. రోడ్డు పనులను కమిషనర్ శనివారం పరిశీలించారు. రోడ్డు నిర్మాణానికి ఇరువైపులా కొంత మంది అభ్యంతరం చేస్తున్న వారితో చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రోడ్డు నిర్మాణానికి 60 అడుగులు మాత్రమే కావాలన్నారు. అందులో భాగంగానే ఎవరికి ఇబ్బంది లేకుండా సర్వే చేస్తున్నామన్నారు. రోడ్డు నిర్మాణంలో భూమి కోల్పోయిన వారికి టి.డి.ఆర్. బాండ్లు ఇస్తున్నామన్నారు. ఎవరికి ఇబ్బంది లేకుండా న్యాయం చేస్తున్నామన్నారు. గెస్ట్ లైన్ డేస్ నుండి సుబ్బారెడ్డి నగర్ మీదుగా డి.బి.ఆర్. రోడ్డు కు అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు. ఈ రోడ్డు వేయడం వలన నగరంలో ట్రాఫిక్ పూర్తిగా తగ్గుతుందన్నారు. అలాగే ఈ రోడ్డు వెంబడి భూములకు అధిక ధరలు వస్తాయన్నారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. కమిషనర్ వెంట అదనపు కమిషనర్ హరిత, ఎస్ఈ చంద్రశేఖర్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ షణ్ముగం, సర్వేయర్లు ప్రసాద్, దేవానంద్, తదితరులు ఉన్నారు.