సివిల్స్ పరీక్షలు ప్రతిష్టాత్మకంగా తీసుకోండి..
Ens Balu
2
Tirupati
2020-10-03 19:22:33
తిరుపతిలో ఈ నెల 4న ఆదివారం యూనియన్ పబ్లిక్ సెర్వీస్ కమీషన్ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు తిరుపతి నందు 14 పరీక్షా కేంద్రాలలో 6802 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని కోవిడ్ నిబంధనలు, యు. పి. ఎస్. సి. గైడ్ లైన్స్ లను అభ్యర్థులు, రూట్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లు తు.చా తప్పకుండా పాటించాలని జిల్లా రెవెన్యూ అధికారి మురళి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో యు.పి.ఎస్. సి పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో, పరీక్షా కేంద్రాల సూపర్వైజర్లతో డిఆర్ఓ, యూపీఎస్సీ ఇంస్పెక్టింగ్ అధికారి ఉమేష్ పాల్ సింగ్. ఆర్డిఓ కనక నరసా రెడ్డి తో కలసి మరోమారు సమీక్ష నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ ఇప్పటికే మూడుసార్లు సమావేశం నిర్వహణ జరిపామని, ఆదివారం తిరుపతి కేంద్రంగా 14 పరీక్షా కేంద్రాలలో 6802 మంది అభ్యర్థులు సివిల్స్ ప్రిలిమ్స్ కు హాజరు కానున్నారని, అన్ని పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేక సానిటేషన్ పూర్తి అయిందని, మాస్కూలు అందుబాటులో ఉంచడం, వైద్య శిబిరాల ఏర్పాటు వంటివి సంబందిత వైద్య అధికారులు చేపట్టాలని సూచించారు. పరీక్షల నిర్వహణ అబ్జర్వర్ గా కె.వి.రమణ ఐ.ఎ.ఎస్., 7 పరీక్షా కేంద్రాలకు కేంద్రాలకు మదనపల్లె సబ్ కలెక్టర్ జాహ్నవి ఐ.ఎ.ఎస్., మరో 7 కేంద్రాలకు అసిస్టెంట్ కలెక్టర్ విష్ణు చరణ్ ఐ.ఎ.ఎస్.,ల ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని అన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు, ఒక గుర్తింపు కార్డు తప్పనిసరి వెంట పరీక్షా కేంద్రానికి తీసుకురావాలని, ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్షా కేంద్రాలలోకి అనుమతి లేదని తెలిపారు. పరీక్షల నిర్వహణ సమయం ఉదయం 9:30 - 11:30 , మద్యాహ్నం 2:30 నుంచి 4:30 గంటల మధ్య రెండు పేపర్ లు వ్రాయనున్నారని, అర్థ గంట ముందుగా పరీక్షా కేంద్రాల మెయిన్ గేట్ మూసివేస్తారని, 10 నిమిషాలు ముందుగానే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలలోకి వెళ్లాలని ఆ పై అనుమతి ఉండదని తెలిపారు. ఇన్విజిలేటర్లకు కూడా పరీక్షా కేంద్రాల్లో సెల్ ఫోన్ అనుమతి వుండదని తెలిపారు.