సంక్షేమ పథకాలు వినియోగించుకోవాలి..
Ens Balu
3
విశాఖ సిటీ
2020-10-03 19:41:10
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. భీమిలి నియోజక వర్గంలోని జివిఎంసి పరిధి జోన్-1లో రూ.181.16 లక్షలతో పలు అభివృద్థి పనులకు శనివారం ఆయన శంఖుస్థాపన చేశారు. కళానగర్ లో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కళానగర్ లో తాగునీరు సరిగా రావడం లేదని పలువురు మహిళలు మంత్రి దృష్టికి తీసుకురాగా తాగునీటికి సమస్య లేకుండా చూడాలని జివియంసి అధికారులను ఆదేశించారు. కరోనా నేపథ్యంలో అందరూ సామాజిక దూరం పాటించి మాస్క్ లు తప్పనిసరిగా వినియోగించాలని కోరారు. అంతకు ముందు ఆయన జివియంసి పరిధి 7వ వార్డు కళానగర్ లోని బి.టి.రోడ్డుకు రూ.9 లక్షలు, సచివాలయం వెనుక సి.సి.రోడ్డు, కాలువ పనులకు రూ.19.20 లక్షలు, సి.సి. కాలువ నుండి మల్లయ్యపాలెం ముత్యాలమ్మ టెంపుల్ వరకు బి.టి. రోడ్డుకు 15 లక్షల రూపాయల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 6వ వార్డులోని ప్రశాంతి నగర్ నుండి కొమ్మాది వరకు వంద అడుగుల రోడ్డు కల్వర్టు వరకు 199.16 లక్షల రూపాయల పనులకు, 5వ వార్డులోని డ్రైవర్స్ కాలని, సాయిరాం కాలనీలలో సి.సి.రోడ్డు, కాలువ నిర్మాణంనకు, సాయిరాం కాలనీ మొదటి దశ లోని బి.టి. రోడ్డు తోపాటు సి.సి. కాలువ నిర్మాణంనకు 19.40 లక్షల రూపాయలు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమీషనర్ రాము, తహసీల్థార్ నరసింహమూర్తి, తదితరులు పాల్గొన్నారు.