సివిల్స్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి..
Ens Balu
3
కలెక్టరేట్
2020-10-03 20:00:43
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణ పై జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్, జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి టెలికాన్ఫరెన్సు ద్వారా రూట్ అధికారులు, వెన్యూ సూపర్ వైజర్లు, జీవీఎంసీ, పోలీసు, డిఎంహెచ్ఓ, ఈపిడిసిఎల్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సివిల్స్ పరీక్షలను సజావుగా, పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఆదివారం (4-10-2020) నిర్వహించే ఈ పరీక్షల కు జిల్లా లో 27 పరీక్షా కేంద్రాల లో 10,796 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారని తెలిపారు.
పోటీ పడుతున్న అభ్యర్థులు, పరీక్షల నిర్వహణ సిబ్బంది సహా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని తెలిపారు. ప్రతి నిమిషం ఎంతో విలువైనదని, యూపీఎస్ సీ నిబంధనల ప్రకారం ఖచ్చితమైన షెడ్యూల్ ను, టైమ్ లైన్ లను పాటించాలని నిర్వహణ అధికారులకు, సిబ్బందికి సూచించారు. సీనియర్ ఐఏఎస్ అధికారులు, యూపీఎస్ సీ పరిశీలకులు పరీక్షా కేంద్రాల ను తనిఖీ చేస్తారని తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాలు శానిటైజ్ చేసారని, త్రాగు నీటి సౌకర్యం కల్పించామని తెలిపారు. డిఎంహెచ్ఓ సిబ్బంది కోవిడ్ నిబంధనల మేరకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈపిడిసిఎల్ తరపున ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తారని తెలిపారు. కలెక్టరేట్ లో డిఆర్ఓ ఆధ్వర్యంలో కంట్రోల్ రూం నిర్వహిస్తున్నామని తెలిపారు. పోలీసు శాఖ పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేసిందని, ఎగ్జామ్స్ మెటీరియల్ ను తరలించేందుకు ఎస్కార్ట్ ఇస్తున్నారని తెలిపారు. ఆర్ టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు.