సబ్బం దురాక్రమణకు అడ్డు కంచె..


Ens Balu
5
Seethammadara
2020-10-03 20:21:12

నేను మాజీ ఎంపీని...మాజీ విశాఖ మేయర్ ని.. నేను ప్రభుత్వ స్థలం కబ్జా చేస్తే అడ్డుకునేదవెవరు అనుకొని దర్జాగా కబ్జాచేసి ప్రభుత్వం, అందులో నిర్మించిన మరుగు దొడ్లు జీవిఎంసి అధికారులు అక్రమమంటూ కూల్చేస్తే తప్పా ఆక్రమణ ఫలితం ఎలావుంటుందో మాజీ ఎంపీ టిడిపినేత సబ్బంహరికి తెలియలేదు. జీవీఎంసికి చెందిన స్థలాన్ని ఎంచక్కా కబ్జా చేసి మరుగుదొడ్లు  నిర్మించాననుకొని సంబరపడుతూ ఇన్నేళ్లూ అనుభవించిన సబ్బంకు..కళ్లముందే అధికారులు ఆక్రమణలు తొలిగిస్తుంటే ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది...చేసింది తప్పే అయినా అధికారులపైకి ఒంటికాలిపై లేచినా ఫలితం లేకుండా పోయింది. ఒకటికాదు రెండు కాదే ఏకంగా 12 అడుగుల స్థానిక పార్క్‌స్థలాన్ని ఆక్రమించి సొంత నిర్మాణాన్ని చేపట్టారు సబ్బం హరి. దీనితోపాటు మరికొంత ప్రభుత్వం స్థలం ఇంటి స్థలంలో కలిపేసుకున్నారు. ఈ విషయం కాస్తా జీవిఎంసీ అధికారుల దృష్టికి రావడంతో అక్రమ నిర్మాణన్ని తొలగించాలని నోటీసులు జారీచేశారు. అయినీ సబ్బం నోటీసులకు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో శనివారం ఉదయం జేసీబీతో వచ్చిన జీవిఎంసీ అధికారులు మాజీ ఎంపీకి గట్టి ఝలక్‌ ఇస్తూ... అక్రమ నిర్మాణాలను ఉన్నఫళంగా కూల్చేశారు. ప్రభుత్వ స్థలంలోని అక్రమ నిర్మాణాన్ని తొలగించారు. అంతేకాకుండా సబ్బం మరోసారి ఆ స్థలాన్ని ఆక్రమించకుండా.. ఆక్రమించిన ఖాళీ స్థలంలోనే ఇనుప కంచె ఏర్పాటు చేశారు. అక్రమ నిర్మాణాలను కూల్చడానికి వచ్చిన అధికారులపై సబ్బం హరి గట్టిగానే నోరుపారేసుకున్నారు. మెడలు విస్తానంటూ బెదిరింపులకు దిగారు. ఏం తమాషాలు చేస్తున్నారా ఆయన అనుచరులు సైతం అధికారులతో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకొని ఘటనాస్థలానికి చేసుకున్నా పోలీసులు  సముదాయించే ప్రయత్నం చేశారు. తాజా వివాదంపై జీవీఎంసీ ఏసీపీ మహాపాత్ర మాట్లాడుతూ.. ‘12 అడుగుల ప్రభుత్వ స్థలం సబ్బం హరి కబ్జా చేశారని వివరించారు. ప్రభుత్వ రికార్డ్ ప్రకారం ఆ స్థలం ప్రభుత్వానిదని.. కబ్జా స్థలంలో నిర్మించిన నిర్మాణాలను తొలగించామని వివరణ ఇచ్చారు. ఆక్రమించిన కాళీ స్థలంలో కంచె కూడా ఏర్పాటు చేశామన్న ఏసీపి... సమాచారం లేకుండా తొలగించాము అన్న సబ్బం హరి మాటల్లో వాస్తవం లేదని కొట్టిపడేశారు. అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని నోటీసు జరిచేసామని అయితే ఆ నోటీసుకు సబ్బం హరి స్పందించలేదన్నారు. నోటీసుకు స్పందించక పోవడంతోనే టాయిలెట్ తొలగించి, ఆక్రమించిన స్థలాన్ని స్వాధీనం చేసుకున్నాము.’అని తెలిపారు. ఇన్నేళ్లపాటు తొంగిచూడని జివిఎంసీ అధికారులు మాజీ ఎంపీ సబ్బంహరి ఆక్రమించిన స్థలాన్ని జేసీబీలతో కూల్చడం రాజకీయవర్గాల్లో చర్చకి దారి తీసింది.