ఏయ్ నేనేంటో 24 గంట్లల్లో చూపిస్తా...
Ens Balu
2
Seethammadara
2020-10-03 21:19:50
విజయసాయిరెడ్డి నా సంగతి నీకింకా తెలిసిట్టులేదు.. నాకోసం సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి తెలుసు.. నువ్వేదో విశాఖలో కూర్చోని ఏదో డాన్సులు చేద్దామనుకుంటే కుదరదు.. నేనేంటో 24 గంటల్లో చూపిస్తా... చూస్తావా... ఏంటి ఇవేవో కొత్తగా తీయబోయే బాలయ్య సినిమాలోని డైలాగులనుకుంటున్నారా...అలా అనుకుంటే మాజీ ఎంపీ సబ్బం కబ్జా చేసిన స్థలంలో కాలుమోపినట్టే.. విశాఖ మాజీ మేయర్, టిడిపినేత, సబ్బంహరి ఆక్రమణలను కూలగొట్టడానికి వచ్చిన జీవిఎంసీ అధికారులపై చిందేస్తూనే విజయసాయిరెడ్డికి గట్టి వార్నింగ్ ఇవ్వడానికి చేసిన సబ్బం హల్ ఛల్.. ఇలాంటి మేటర్ లునాకు పెద్ద విషయం కాదు..లీగల్ గా తేల్చుకోవచ్చు కానీ అలాచేస్తే నేనేంటో మీకు తెలియదు కదా..వీడితో ఎందుకు పెట్టుకున్నానురా బూబూ అనేలా చేయకపోతే చూడండి అంటూ టిడిపి మాజీ ఎమ్మెల్యే పల్లాను వెంటబెట్టుకొని ఊగిపోయారు సబ్బం.. అయితే ఈవ్యాఖ్యలప పై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి ఘాటుగానే స్పందించారు..నువ్వేదో అనుకుంటున్నావ్.. అధికారాన్నిఒక్కసారి పక్కన పెడితే... రౌడీయిజం మేమూ చేయగలమంటూ వెంట్రుకను తీసిపడేసినట్టుగా సబ్బం వ్యాఖ్యలను తిప్పికొట్టారు. నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడకపోతే బాగోదంటూ గట్టినా వార్నింగ్ ఇచ్చారు ముత్తం. ఆక్రమణలు, దురాక్రమణల విషయంలో చట్టం తనపని తాను చేసుకుపోతుంది..అంతే తప్పితే ఎవరిమీదా ప్రభుత్వానికి అక్కసు ఉండదు...పైగా అభిమానం మాత్రమే వుంటుందని చెప్పుకొచ్చారు. మాజీ ఎంపీ సబ్బం హరి జీవిఎంపీ పార్కు స్థలం సుమారు 12 అడుగులకు పైగా ఆక్రమించి అక్కడ మరుగుదొడ్లు నిర్మించారు. ఇంతకాలం బాగానే వున్నా జీవిఎంసీ అధికారులు ఈ మధ్యనే దీనిని గుర్తించి నోటీలిచ్చారు. అయినా వాటిని పట్టించుకోకుండా ఉండిపోయారు. దీంతో ఏసీపి పోలీసులతో రంగంలోకి దిగి ఆక్రమించిన స్థలాన్ని అమాంతం కూల్చివేశారు. ఆ క్రమంలో సబ్బంహరి కోపం ఊగిపోతూ...నేనేంటో 24 గంటల్లో చూపిస్తానని ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ఈ అంశం రాజకీయ చర్చకు మరింత ఆజ్యం పోసింది. సబ్బం హరి ఇంటి ఆక్రమణను కూలగొట్టే సమయంలో చేసిన వ్యాఖ్యలను అటు పోలీసులు, ఇటు జీవిఎంసీ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండానే తమ పని తాము చేసుకుపోవడం విశేషం. పైగా నోటీసులు ఇచ్చిన తరువాత పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ ఆస్తులను కాపాడాలనే ఆక్రమణలు తొలగించామని జీవిఎంసీ అధికారులు చెప్పుకొచ్చారు. వాస్తవానికి పార్కు స్థలంలో ఎపుడో ఆక్రమించి సబ్బం హరి నిర్మాణాలు చేశారు. అప్పటి నుంచి చూస్తూ ఉండిపోయిన జీవిఎంసీ అధికారులు, తాజాగా ఈ విషయంపై ఫోకస్ చేయడం విశేషం. పైగా జీవిఎంసీ అధికారులను కాకుండా మాజీ ఎంపీ సబ్బం హరి, ప్రభుత్వాన్ని, మంత్రులు, ఎంపీ విజయసాయిరెడ్డిపై నోరు జారడాన్ని కూడా వైఎస్సార్సీపీ శ్రేణులు తీవ్రంగానే పరిగనిస్తుండటం విశేషం.