అనంతలో సివిల్స్ పరీక్షల పరిశీలన..


Ens Balu
5
Anantapur
2020-10-04 11:48:37

అనంతపురం జిల్లాలో జరుగుతున్న యూపీఎస్సీ పరీక్షల నేపథ్యంలో అనంతపురంలోని జెఎన్టీయూఏ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏ, బి సెంటర్ లను, కేఎస్ఎన్ గవర్నమెంట్ యూజీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్, జీసస్ నగర్లోని మోర్ సూపర్ మార్కెట్ దగ్గర ఉన్న ఎస్వీ డిగ్రీ కాలేజ్ అండ్ పీజీ కాలేజ్ వెన్యూ పరీక్ష కేంద్రాలను అనంతపురం సెంటర్ అబ్జర్వర్ కోన శశిధర్ ఐ ఏ ఎస్ పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. అలాగే నగరంలోని గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు లోని జిల్లా పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఎస్ఎస్ బిఎన్ డిగ్రీ కాలేజ్ ( అటానమస్), టవర్ క్లాక్ వద్దనున్న గవర్నమెంట్ కాలేజ్ ఫర్ మెన్ ( అటానమస్)  వెన్యూ పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పరిశీలించారు.  కలెక్టర్ వెంట యూపీఎస్సీ అండర్ సెక్రటరీ సాబిల్ కిండో, అబ్జర్వర్ తో పాటు జాయింట్ కలెక్టర్ ( రెవెన్యూ మరియు రైతు భరోసా) నిశాంత్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ జి.సూర్య ఉన్నారు.