మంత్రి బొత్సాను కలిసిన ఎమ్మెల్యే వాసుపల్లి..


Ens Balu
2
సర్క్యూట్ హౌస్
2020-10-04 11:50:59

రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణను ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఆదివారం సర్క్యూట్ హౌస్లో మంత్రి బొత్సను కలిసి పుష్ఫగుచ్చం ఇచ్చి సాలువాతో సత్కరించారు. ఇటీవలే వైఎస్సార్సీపీ పార్టీకి తీర్ధం పుచ్చుకున్న తన తనయుల విషయాన్ని మంత్రి ద్రుష్టికి తీసుకొచ్చారు. పార్టీ అభివ్రుద్ధికి శక్తివంచన లేకుండా క్రుషి చేస్తానని ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ ను, ఎంపీ ఎంవీవీసత్యన్నారాయణలను కూడా వాసుపల్లి మర్యాదపూర్వకంగా కలిశారు. అంతేకాకుండా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో పరిష్కారం కాకుండా మిగిలిపోయిన సమస్యలను కూడా మంత్రి ద్రుష్టికి తీసుకువచ్చారు.. ఎమ్మెల్యేతోపాటు  అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్, గాజువాక ఎమ్మెల్యే తిప్పలనాగిరెడ్డి కూడా ఉన్నారు.