ఎన్ఏడీ-గోపాలపట్నం లైన్ క్లియర్..బొత్సా
Ens Balu
4
ఎన్ఏడి ఫ్లై ఓవర్
2020-10-04 14:35:17
విశాఖలో ఎన్ఏడీ నుంచి గోపాలపట్నం వైపుగా వెళ్ళే ఫ్లైఓవర్ వంతెన నను పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎన్ఏడి దగ్గర వాహనాల రద్దీ తగ్గించేందుకే ఈ ఫ్లైఓవర్ ను త్వరగా ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే గజువాక నుండి ఫ్లైఓవర్ మీదుగా తాటిచెట్ల పాలెం వైపుగా వెళ్ళే మర్గాన్ని ప్రారంభించడం జరిగిందన్న మంత్రి బొత్స త్వరలో అన్ని మార్గాల పనులు పూర్తి చేసి వాహన దారులకు ఫ్లైఓవర్ వంతెన నను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ప్రస్తుతం ఎన్ .ఏడీ ఫ్లైఓవర్ ఫై రెండు మార్గాలు అందుబాటులొకి తేవటం వలన టాఫిక్ రద్దీ తగ్గుతుందని చెప్పారు. మిగిలిన పనులను త్వరితగతిన నిర్మాణాలు పూర్తిచేయాలని వీఎంఆర్డీఏ అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్ర మంలో పర్యాటక శాఖా మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాస రావు, ఎం .పి .ఎం .వి.వి సత్యనారయణ , ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ , వి ఎమ్ ఆర్ డి ఎ కమిషనరు పి . కోటేశ్వర రావు, జీవీఎంసీ కమిషనర్ డా. జి.సృజన తదితరులు పాల్గొన్నారు.