సివిల్స్ పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్..


Ens Balu
1
Visakhapatnam
2020-10-04 14:40:01

విశాఖనగరంలో జరగుతున్న సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షా కేంద్రంను  కలెక్టర్ వి. వినయ్ చంద్ ఆదివారం సందర్శించారు.  యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిష న్ పరీక్షలను నగరంలో పలు కేంద్రాలలో పరీక్షలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. జ్ఞానాపురంలోని సోఫియా కళాశాలలో నిర్వహించుచున్న సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షా కేంద్రంను ఆయన  సందర్శించి పరిశీలించారు. పరీక్ష అనంతరం ఒయమ్మార్ సీట్లు ప్యాకింగ్, తదితర అంశాలపై ఆయన కళాశాల సిబ్బందికి పలు సూచన లు చేశారు. కోవిడ్-19 పై జాగ్రత్తలు తీసుకుంటూ సామాజిక దూరం పాటించి, అభ్యర్థులు మాస్క్ ధరించే విధంగా చూడాలని కళాశాల సిబ్బందిని ఆదేశించారు. బయటకు వెళ్లే సమయంలో కూడా సామాజిక దూరం పాటించేలా ఇన్విజిలేటర్లు చూడాలని సూచించారు. జిల్లా కలెక్టర్ తో పాటు సియండి ఎ.పి.సోలార్, ఎనర్జీ ఎక్స్ అఫీసియో ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్ పాల్గొన్నారు.