టిటిడి ఈఓగా ఎవి.ధర్మారెడ్డి..


Ens Balu
2
Tirumala
2020-10-04 15:16:59

తిరుమల ఈఓ(ఎఫ్ఏసి)గా ఎవి.ధర్మారెడ్డి ఆదివారం  తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు.   ఆలయంలోని రంగనాయకుల మండపంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీపై వెళుతున్న ఈవో  అనిల్ కుమార్ సింఘాల్ ఈ మేరకు  ఎవి.ధర్మా రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అనంతరం శ్రీవారి ఆలయంలో  ఎవి.ధర్మారెడ్డి చేత జెఈఓ పి.బసంత్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తరువాత  అనిల్ కుమార్ సింఘాల్, ఎవి.ధర్మారెడ్డి కలిసి శ్రీవారి దర్శనం చేసుకుని రంగనాయకుల మండపంలో వేద పండితులతో వేదాశీర్వచనం పొందారు. అనిల్ కుమార్ సింఘాల్ కు ధర్మారెడ్డి శ్రీవారి తీర్థప్రసాదాలు అందించారు. జెఈఓ పి.బసంత్ కుమార్, సివిఎస్ఓ  గోపీనాథ్ జెట్టి కలిసి ధర్మారెడ్డికి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో  హ‌రీంద్ర‌నాథ్‌, డెప్యూటి ఈఓ బోర్డు సెల్  సుధారాణి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.