ఆప్యాయం పిలిచే ఆ గొంతు మూగబోయింది..


Ens Balu
3
Visakhapatnam
2020-10-04 17:20:22

ఉత్తరాంధ్రా రాజకీయాన్ని  మూడు దశాబ్దాల పాటు ప్రభావితం చేసిన ద్రోణంరాజు సత్యనారాయణ వారసుడిగా వచ్చిన  ద్రోణంరాజు శ్రీనివాస్ తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్న మహా మనిషి ఇక లేరనే వార్త  అందరిని కలచివేసింది. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పిలిచే ఆ పిలుపు మూగ  బోయింది. సాయం కోసం వెళ్లే వారికీ  ఆపన్న హస్తం అందించే ఆపద్బాంధవుడు అస్తమించారనే వార్త అనుచరులతోపాటు అన్ని వర్గాల ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ద్రోణంరాజు శ్రీనివాస్  1961 ఫిబ్రవరి 1న జన్మించారు. 1980-81లో బుల్లయ్య కళాశాలలో చదువుతున్నప్పుడు, రాజకీయాలపై ఆసక్తి చూపించి, ఎన్‌ఎస్‌యుఐ నాయకుడయ్యారు. శ్రీనివాస్   లా విద్యను అభ్యసించారు.  శ్రీనివాస్ తన కెరీర్లో అనేక రాజకీయ పదవులను నిర్వహించారు.   1984-85లో పెందుర్తి నియోజకవర్గంలో యువ కాంగ్రెస్ నాయకుడు అయ్యారు. 1987-89 మధ్య జిల్లా యువ కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేశారు.  తరువాత, అతను 1991 నుండి 1997 వరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రాథమిక కార్యదర్శిగా పనిచేశారు.. జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడయ్యాడు 2000 వరకు ఆ పదవిలో పనిచేశారు.  2001 నుండి 2006 వరకు డిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు 1994 , 2014, 2019లో  ఎమ్మెల్యేగా పోటీ చేసి  ఓటమి పాలయ్యారు. 2006 , 2009 ల్లో ఎమ్మెల్యేగా  ఎన్నికయ్యారు. అయిదు సార్లు ఎమ్మెగా పోటీ చేసి రెండు సార్లు గెలిచారు.  ద్రోణంరాజు  శ్రీనివాస్ ప్రభుత్వ విఫ్ గా, టి టి డి సభ్యుడుగా  పని చేశారు. పిసిసి ప్రధాన కార్యదర్శిగా , నగర కాంగ్రెస్ అధ్యక్షుడుగా కాంగ్రెస్ లో అనేక కీలకమైన పదవులు చేపట్టారు. కేంద్ర రాష్ట్ర స్థాయిలో ఎంతో  మందితో సత్స సంబంధాలు కలిగిన మచ్చ లేని నిజాయితీ పరుడైన నేత ద్రోణంరాజు శ్రీనివాస్ .  వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున గత ఏడాది జరిగిన ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడారు,  జగన్  శ్రీనివాస్ ను గుర్తించి విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ ( వీఎంఆర్డీఏ) తొలి  చైర్మన్ గా  నియమించారు  గత నెల రోజుల కాలంగా కరోనా బారిన పడి  చికిత్స అనంతరం కరోనా నుండి కోలుకున్నప్పటికీ ఆయన ఆరోగ్యం క్షీణించడంతో    ద్రోణంరాజు శ్రీనివాస్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ  మృతి చెందారు . పార్టీలకు అతీతంగా అందరితో సత్స సంబంధాలు కలిగి వున్నా ఏకైక నేత ద్రోణం రాజు రాజు శ్రీనివాస్  అటువంటి  మంచి వ్యక్తిని కోల్పోవడం చాల బాధాకరం . సాయం కోసం వెళితే మన సమక్షంలో సంబంధిత అధికారికి ఫోన్ చేసి పని చేయండి అంటూ సౌమ్యంగా చెప్పడం శ్రీనివాస్ నైజం   మనం ఆహ్వానించే కార్యక్రమానికి అతిథిగా కాక కుటుంబ సభ్యుడుగా పాల్గొనడం గొప్ప విషయం .నీతి నిజయతీలే ఊపిరిగా, నిష్కలంక రాజకీయ నాయకుని మనం మళ్ళీ చూడలేం..