హోటల్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానం..
Ens Balu
2
Vizianagaram
2020-10-04 17:52:38
కేంద్ర, రాష్ట్ర పర్యాటక శాఖల ఆధ్వర్యంలో తిరుపతిలో ఏర్పాటు చేసిన స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ కేటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్ సంస్థలో ఆతిథ్య రంగంలో పలు కోర్సుల్లో 2020-21 సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సంస్థ ప్రతినిధి శివరామకృష్ణ తెలిపారు. హాస్పిటాలిటీ, హోటల్ అడ్మినిస్ట్రేషన్ లో మూడేళ్ల బి.ఎస్సీ కోర్సు, ఫుడ్ ప్రొడక్షన్, పెట్టిసరీలో క్రాఫ్టు కోర్సు, ఫుడ్ అండ్ బెవరేజెస్ లో సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు పేర్కొన్నారు. మూడేళ్ల బి.ఎస్సీ కోర్సుకు ఇంటర్ ఉత్తీర్ణత కలిగి జాతీయ స్థాయిలో నిర్వహించిన ఎన్.సి.హెచ్.ఎం.సి.టి. ఉమ్మడి ప్రవేశపరీక్ష-2020లో ర్యాంకు వచ్చి వుండాలని, అభ్యర్ధుల వయస్సు 22 ఏళ్లలోపు వుండాలని పేర్కొన్నారు. ఫుడ్ ప్రొడక్షన్, పెట్టిసరిలో క్రాఫ్ట్ కోర్సుకు పదో తరగతి ఉత్తీర్ణత కలిగి వుండాలని పేర్కొన్నారు. అభ్యర్ధుల వయస్సు 25 ఏళ్లలోపు వుండాలన్నారు. ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీసు కోర్సుకు కూడా పదో తరగతి ఉత్తీర్ణత కలిగి అభ్యర్ధుల వయస్సు 25 ఏళ్లలోపు వుండాలన్నారు. బాల బాలికలకు వేర్వేరుగా హస్టల్ వసతి కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కోర్సులు పూర్తిచేసిన వారికి రాష్ట్ర పర్యాటక సంస్థ నిర్వహించే హోటళ్లు, ప్రముఖ ఫైవ్ స్టార్ హోటళ్లలో ఉద్యోగావకాశాలు కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్ధులు పర్యాటక సంస్థ వెబ్ సైట్ www.sihmtpt.org లో నమూనా దరఖాస్తు వుంటుందని, ఈ ప్రొఫార్మాలో అక్టోబరు 10వ తేదీలోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి వుంటుందన్నారు. పూర్తి వివరాల కోసం శివరామకృష్ణ 9700440604, 9701343846 ఫోన్ నెంబర్ల ద్వారా సంప్రదించాలని సూచించారు.