ద్రోణం మ్రుతిపట్ల గంట్ల ప్రగాఢ సంతాపం
Ens Balu
3
Visakhapatnam
2020-10-04 18:32:39
విశాఖలోని వీఎంఆర్డీఏ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ద్రోణం రాజుశ్రీనివాస్ అకాల మ్రుతిపట్ల జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబా బు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆదివారం పినాకిల్ ఆసుపత్రిలో వైద్యం పొందుతూ, మ్రుతిచెందడం తనను ఎంతో బాధ కలిగిచిందని అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడూ, జర్నలి స్టులతో ద్రోణంరాజు శ్రీనివాస్ ఎంతో ఆప్యాయంగా ఉండేవారని, అన్ని కార్యక్రమాలు పిలిచిన వెంటనే హాజరయ్యే వారన్నారు. అలాంటి మంచి మనిషి మ్రుతిచెం దారనే వార్త తనను చాలా కలచివేసిందన్నారు. పార్టీలోనూ, ప్రజలతోనూ ఎంతో ఆప్యాయతా ఉండే ద్రోణంరాజు శ్రీనివాస్ ఇక లేరనే విషయం జీర్ణించుకోలేక పోతు న్నామని అన్నారు. జర్నలిస్టులకు కూడా ఆయన సహచర కుటుంబ సభ్యులుగా ఉండేవారన్నారు. ఈ సందర్భంగా ఆ కుటుంబాలనికి గంట్లశ్రీనుబాబు, తన విచారాన్ని, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.