ద్రోణంరాజు శ్రీనివాస్ లేని లోటు తీర్చలేనిది..


Ens Balu
1
వైఎస్సార్పీపి కార్యాలయం
2020-10-04 18:45:45

వీఎంఆర్డీఏ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ మ్రుతి వైఎస్సార్సీపీ కి తీరని లోటని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ద్రోణం అకాల మ్రుతి సందర్భంగా  వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర  కార్యాలయం లో  మాజీ శాసనసభ్యులు, మాజీ వి.ఆర్.డి.ఏ చైర్మన్  ద్రోణం రాజు శ్రీనివాస్ గారి సంతాప సభ  నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పార్టీలో క్రియాశీలంగా వ్యవహరించే నేతను కోల్పోవడం ఎంతో బాధను కలిగించిందన్నారు. వారికి, వారి కుటుంబానికి ఈ సందర్భంగా తమన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అంతకుముందు ద్రోణం రాజు శ్రీనివాస్  చిత్ర పటానికి పూల వేసి నివాళి అర్పించి... రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు  వంశీకృష్ణ శ్రీనివాస్  , శాసనసభ్యులు  గుడివాడ అమర్నాథ్ , అన్నం రెడ్డి అదీప్ రాజు, పార్లమెంట్ కార్యనిర్వాహక అధ్యక్షులు  బేహర్ భాస్కర్ రావు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శికోలా గురువులు, రాష్ట్ర కార్యదర్శి  రొంగాలి జగన్నాధం , శనపల చంద్ర మౌలి,  రాష్ట్ర అదనపు కార్యదర్శి రవి రెడ్డి , మొల్లి  అప్పారావు, పార్టీ ముఖ్య నాయుకులు  మంత్రి రాజశేఖర్,  అనుబంధ విభాగం ల అధ్యక్షులు  బర్కత్ అలీ, శ్రీమతి రాధ, పిలా వెంకట లక్ష్మి,  అల్ప్ఫా కృష్ణ, పార్టీ మహిలు , కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.