అనంతలోనే అత్యధికంగా అభ్యర్ధులు హాజరు..


Ens Balu
1
Anantapur
2020-10-04 18:48:25

యూపీఎస్సీ పరీక్షల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 4 సెంటర్లను ఏర్పాటు చేయగా, అందులో అనంతపురం జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన వెన్యూ కేంద్రాలకు అత్యధికంగా అభ్యర్థులు హాజరైనట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. యూపీఎస్సీ పరీక్షలు రాసే అభ్యర్థులు కోసం కడప, కర్నూలు జిల్లాల నుంచి అనంతపురం పరీక్ష కేంద్రానికి ప్రత్యేక ట్రైన్ లు, ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడంతోనే అభ్యర్థుల హాజరు శాతం పెరిగిందని తెలిపారు.  ఆదివారం యూపీఎస్సీ పరీక్షలు నిర్వహించగా, రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం కేంద్రాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా అనంతపురం జిల్లాకు 3311 మంది అభ్యర్థులను కేటాయించగా, ఉదయం 9:30 గంటల నుంచి 11:30 గంటల వరకు అనంతపురం జిల్లా కేంద్రంలోని 8 వెన్యూ కేంద్రాలలో జరిగిన యూపీఎస్సీ పరీక్షలకు 1807 మంది అభ్యర్థులు హాజరు కాగా, మరో 1504 మంది అభ్యర్థులు పరీక్ష కు గైర్హాజరయ్యారని, 54.57 శాతం హాజరు నమోదైందన్నారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 1795 మంది అభ్యర్థులు హాజరు కాగా, మరో 1516 మంది అభ్యర్థులు పరీక్షకు గైర్హాజరయ్యారని, 54.21 శాతం హాజరు నమోదైందన్నారు.  రాష్ట్రంలోని తిరుపతి కేంద్రంలోని 14 వెన్యూ కేంద్రాలలో జరిగిన యూపీఎస్సీ పరీక్షలకు 6790 మంది అభ్యర్థులను కేటాయించగా, ఉదయం పరీక్ష కు 3234 మంది అభ్యర్థులు హాజరు కాగా, 47.63 శాతం హాజరు నమోదైందన్నారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 3207 మంది అభ్యర్థులు హాజరు కాగా, 47.23 శాతం హాజరు నమోదైందన్నారు. రాష్ట్రంలోని విజయవాడ కేంద్రంలోని 27 వెన్యూ కేంద్రాలలో జరిగిన యూపీఎస్సీ పరీక్షలకు 12, 533 మంది అభ్యర్థులను కేటాయించగా, ఉదయం పరీక్షకు 5,421 మంది అభ్యర్థులు హాజరు కాగా, 7,091 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారని, 43.33 శాతం హాజరు నమోదైందన్నారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 5,376 మంది అభ్యర్థులు హాజరు కాగా, 7,136 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారని, 42.97 శాతం హాజరు నమోదైందన్నారు. అలాగే విశాఖపట్నం కేంద్రంలోని వెన్యూ కేంద్రాలలో జరిగిన యూపీఎస్సీ పరీక్షలకు 10, 779 మంది అభ్యర్థులను కేటాయించగా, ఉదయం పరీక్షకు 4,863 మంది అభ్యర్థులు హాజరు కాగా, 5,916 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారని, 45.12 శాతం హాజరు నమోదైందన్నారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 4,811 మంది అభ్యర్థులు హాజరు కాగా, 5,968 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారని, 44.63 శాతం హాజరు నమోదైందన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన యూపీఎస్సీ పరీక్షలకు సంబంధించి అనంతపురం జిల్లా కేంద్రంలోని పరీక్ష కేంద్రాలకు హాజరయ్యేందుకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అభ్యర్థులకు ప్రత్యేక ట్రైన్ లు, బస్సులను ఏర్పాటు చేశామని, అందువల్ల అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు సమయానికి చేరుకోగలిగారని జిల్లా కలెక్టర్ తెలిపారు. రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లా కేంద్రంలో పరీక్షలకు అభ్యర్థులు అత్యధిక శాతం హాజరయ్యారన్నారు. ప్రశాంత వాతావరణంలో కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహించామని, కోవిడ్ నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో యూపీఎస్సీ కమిషన్ నియమ నిబంధనలు పాటిస్తూ అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు. అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని వసతులను కల్పించి ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించామని జిల్లా కలెక్టర్ తెలిపారు.